ట్రాన్స్‌జెండర్లకు వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశాలు..

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వివిధ సెక్షన్ల ప్రజలకు కరోనా టీకాలు ఇస్తున్నట్లుగానే ట్రాన్స్‌జెండర్లకు కూడా ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా సమయంలో వీరికి కూడా టీకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. అనేక సెక్షన్ల ప్రజలకు టీకాలు ఇస్తున్నప్పటికీ వీరికి మాత్రం అవి అందడం లేదంటూ దాఖలైన పిటిషన్‌ను బుధవారం విచారించిన తెలంగాణ హైకోర్టు బెంచ్ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌కు పై ఆదేశాలను జారీ చేసింది. జిల్లాలవారీగా ట్రాన్స్‌జెండర్ల అసోసియేషన్లకు చెందిన […]

Update: 2021-06-16 12:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వివిధ సెక్షన్ల ప్రజలకు కరోనా టీకాలు ఇస్తున్నట్లుగానే ట్రాన్స్‌జెండర్లకు కూడా ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా సమయంలో వీరికి కూడా టీకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. అనేక సెక్షన్ల ప్రజలకు టీకాలు ఇస్తున్నప్పటికీ వీరికి మాత్రం అవి అందడం లేదంటూ దాఖలైన పిటిషన్‌ను బుధవారం విచారించిన తెలంగాణ హైకోర్టు బెంచ్ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌కు పై ఆదేశాలను జారీ చేసింది. జిల్లాలవారీగా ట్రాన్స్‌జెండర్ల అసోసియేషన్లకు చెందిన ప్రతినిధుల వివరాలను అడ్వొకేట్ జనరల్‌కు సమర్పించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ఇందులో అర్హులైనవారికి టీకాలను అందించే బాధ్యతను ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ తీసుకోవాలని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి నివేదికను హైకోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసి తదుపరి విచారణను ఆగస్టు 18వ తేదీకి వాయిదా వేసింది.

Tags:    

Similar News