టీటీడీ బోర్డు సభ్యులకు హైకోర్టు షాక్

దిశ, ఏపీ బ్యూరో: టీటీడీ బోర్డులోని 18 మంది సభ్యులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. నేరారోపణలు, రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నోటీసులు జారీ చేసింది. బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి టీటీడీ పాలకమండలి సభ్యులపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. టీటీడీ బోర్డు సభ్యుల్లోని 24 మందిలో 14 మంది సభ్యులపై నేరచరిత్ర ఉందని పిటిషనర్‌ భానుప్రకాశ్ రెడ్డి వ్యాజ్యంలో ఆరోపించారు. అలాగే నలుగురిని రాజకీయ ప్రాధాన్యతతో నియమించారని పిటిషనర్‌ ఆరోపించారు. ఈ వ్యాజ్యంపై బుధవారం […]

Update: 2021-10-06 07:17 GMT

దిశ, ఏపీ బ్యూరో: టీటీడీ బోర్డులోని 18 మంది సభ్యులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. నేరారోపణలు, రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నోటీసులు జారీ చేసింది. బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి టీటీడీ పాలకమండలి సభ్యులపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. టీటీడీ బోర్డు సభ్యుల్లోని 24 మందిలో 14 మంది సభ్యులపై నేరచరిత్ర ఉందని పిటిషనర్‌ భానుప్రకాశ్ రెడ్డి వ్యాజ్యంలో ఆరోపించారు. అలాగే నలుగురిని రాజకీయ ప్రాధాన్యతతో నియమించారని పిటిషనర్‌ ఆరోపించారు. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. నేరారోపణలు, రాజకీయ ప్రాధాన్యతతో నియమితులయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 18 మంది సభ్యులను ఇంప్లీడ్‌ చేయాలని పిటిషనర్‌ తరుపు న్యాయవాది అశ్వినీకుమార్‌ కోర్టులో వాదనలు వినిపించారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. 18 మంది సభ్యులకు నోటీసులు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను దసరా సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.

Tags:    

Similar News