వీసీల నియామకంపై వివరణ ఇవ్వండి
దిశ, తెలంగాణ బ్యూరో : వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం, నగరంలోని తెలుగు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సెలర్ల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ రెండు వర్శిటీలకు ప్రభుత్వం వీసీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ రిటైర్డ్ ప్రిన్సిపాల్ విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్, ఇద్దరు వీసీలకు కూడా నోటీసులు జారీ చేసింది. కాకతీయ వర్శిటీ వీసీగా నియమితులైన […]
దిశ, తెలంగాణ బ్యూరో : వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం, నగరంలోని తెలుగు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సెలర్ల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ రెండు వర్శిటీలకు ప్రభుత్వం వీసీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ రిటైర్డ్ ప్రిన్సిపాల్ విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్, ఇద్దరు వీసీలకు కూడా నోటీసులు జారీ చేసింది.
కాకతీయ వర్శిటీ వీసీగా నియమితులైన ప్రొఫెసర్ రమేశ్‌కు పదేళ్ల అనుభవం లేదని, కాకతీయ వర్శిటీ వీసీ కిషన్‌రావు వయసు 70 ఏళ్లు దాటిందని, నిబంధనలకు విరుద్ధంగా వీరిద్దరినీ ప్రభుత్వం నియమించిందని విద్యాసాగర్ తన పిటిషన్‌లో ఆరోపించారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డిలతో కూడిన బెంచ్ ఈ పిటిషన్‌ను బుధవారం విచారించి పిటిషనర్ లేవనెత్తిన వాదనలపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, యూజీసీకి, ఇద్దరు వీసీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబరు 27వ తేదీకి వాయిదా వేసింది.