యువకుడి మృతిపై హైకోర్టులో విచారణ

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ చెస్ట్ ఆస్పత్రిలో రవికుమార్ అనే యువకుడి మృతిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆక్సిజన్ అందకే రవికుమార్ మృతిచెందాడని గురువారం పిటిషనర్ వాదనలు వినిపించారు. రవికుమార్ ఆక్సిజన్ అందక చనిపోయాడన్నది అవాస్తవమని అతనికి కరోనా ప్రోటోకాల్ ప్రకారమే చికిత్స జరిగిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ హైకోర్టుకు స్పష్టం చేశారు. యువకుడి మృతిలో ఏమాత్రం వైద్యుల నిర్లక్ష్యం లేదని పేర్కొన్నారు. యువకుడికి ఆక్సిజన్ అందకనే మృతిచెందాడన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని హైకోర్టు ఈ సందర్భంగా […]

Update: 2020-07-30 05:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ చెస్ట్ ఆస్పత్రిలో రవికుమార్ అనే యువకుడి మృతిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆక్సిజన్ అందకే రవికుమార్ మృతిచెందాడని గురువారం పిటిషనర్ వాదనలు వినిపించారు. రవికుమార్ ఆక్సిజన్ అందక చనిపోయాడన్నది అవాస్తవమని అతనికి కరోనా ప్రోటోకాల్ ప్రకారమే చికిత్స జరిగిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ హైకోర్టుకు స్పష్టం చేశారు. యువకుడి మృతిలో ఏమాత్రం వైద్యుల నిర్లక్ష్యం లేదని పేర్కొన్నారు.

యువకుడికి ఆక్సిజన్ అందకనే మృతిచెందాడన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. దీనిపై పూర్తిగా నిగ్గు తేల్చేందుకు పోలీసులను ఆదేశించమంటారా అని హైకోర్టు ప్రశ్నించింది. యువకుడి మృతిపై పూర్తి వివరాలు సమర్పించాలన్న హైకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది.

Tags:    

Similar News