కరోనా మరణాలు దాస్తున్నారు !
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు అధికారుల తీరుపై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నారని అసహనం వ్యక్తం చేసింది. సోమవారం విచారణకు హాజరైన వైద్యారోగ్యశాఖ అధికారులు.. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని కోర్టుకు తెలపగా.. కరోనా టెస్టులే తక్కువగా చేస్తున్నప్పుడు కేసులు ఎలా బయట పడుతాయని ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ల్యాబ్‌లు తక్కువగా ఉన్నాయని, వెంటిలేటర్ల సమాచారాన్ని ఎందుకు […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు అధికారుల తీరుపై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నారని అసహనం వ్యక్తం చేసింది. సోమవారం విచారణకు హాజరైన వైద్యారోగ్యశాఖ అధికారులు.. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని కోర్టుకు తెలపగా.. కరోనా టెస్టులే తక్కువగా చేస్తున్నప్పుడు కేసులు ఎలా బయట పడుతాయని ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ల్యాబ్‌లు తక్కువగా ఉన్నాయని, వెంటిలేటర్ల సమాచారాన్ని ఎందుకు డిస్ ప్లే చేయడం లేదో సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది.