శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్..
దిశ, శంషాబాద్ : దక్షిణాఫ్రికాలో ప్రమాదకరంగా మారిన కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్ వైరస్’ వ్యాప్తి నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పై ఆంక్షలు విధించారు. ప్రయాణానికి 72 గంటల ముందు కరోనా టెస్టులు చేయించుకుని.. ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్టు తీసుకొస్తేనే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ టెస్టుల్లో పాజిటివ్ […]
దిశ, శంషాబాద్ : దక్షిణాఫ్రికాలో ప్రమాదకరంగా మారిన కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్ వైరస్’ వ్యాప్తి నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పై ఆంక్షలు విధించారు. ప్రయాణానికి 72 గంటల ముందు కరోనా టెస్టులు చేయించుకుని.. ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్టు తీసుకొస్తేనే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.
విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ టెస్టుల్లో పాజిటివ్ అని తేలితే అటు నుంచి అటే వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. గతంలో జరిగిన తప్పు ఈసారి రిపీట్ కావొద్దని ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.