దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్దమే- యంగ్ హీరోయిన్

దిశ, వెబ్ డెస్క్: ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది షాలిని పాండే. ఇక ఈ చిత్రం తర్వాత వరుస పరాజయాలను చవిచూసిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయడానికి బాగా కష్టపడుతోంది. ఇప్పటికే బొద్దుగా ఉండే షాలినీ బాలీవుడ్ కోసమే జీరో సైజుకి మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమ్మడు తన బరువు తగ్గడం విషయంలో ఓపెన్ అయ్యింది. ” ‘జయేష్‌ భాయ్‌ జోర్దార్‌’  సినిమా […]

Update: 2021-08-05 22:17 GMT

దిశ, వెబ్ డెస్క్: ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది షాలిని పాండే. ఇక ఈ చిత్రం తర్వాత వరుస పరాజయాలను చవిచూసిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయడానికి బాగా కష్టపడుతోంది. ఇప్పటికే బొద్దుగా ఉండే షాలినీ బాలీవుడ్ కోసమే జీరో సైజుకి మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమ్మడు తన బరువు తగ్గడం విషయంలో ఓపెన్ అయ్యింది.

” ‘జయేష్‌ భాయ్‌ జోర్దార్‌’ సినిమా కోసం నేను బరువు తగ్గాను. అందులో నేను డాన్సర్ గా కనిపిస్తాను. దాని కోసం బరువు తగ్గాల్సివచ్చింది. కథ డిమాండ్ చేస్తే బరువు తగ్గడానికైనా, పెరగడానికైనా నేను రెడీ. ఇక బరువు తగ్గడానికి నేను చాలా కఠినమైన వర్క్ అవుట్స్ చేశాను.. అంతేకాకుండా ఈ సినిమా కోసం చేసిన డాన్స్ ప్రాక్టీస్ కూడా నేను బరువు తగ్గడానికి హెల్ప్ అయ్యిందని” చెప్పుకొచ్చింది. అంతేకాకుండా పాత్ర కోసం తానూ ఏదైనా చేయడానికి సిద్ధమని తెలిపింది. ఇక తెలుగుకు షాలిని దూరమయ్యిందనే చెప్పాలి. త్వరలో అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News