ప్రియాంక ‘అన్ ఫినిష్డ్’.. కంప్లీట్

గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. ఒక సాధారణ అమ్మాయి అయిన ప్రియాంక.. మిస్ ఇండియాగా, మిస్ వరల్డ్‌గా టైటిల్ పొందడం.. తర్వాత బాలీవుడ్ నుంచి హాలీవుడ్ హీరోయిన్‌గా, నిర్మాతగా మారి సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్లడం.. స్ఫూర్తి కలిగించే విషయాలు. కాగా, హాలీవుడ్ సిరీస్ క్వాంటికొ చేస్తున్న సమయంలోనే తను ఓ బుక్ రాస్తున్నట్లు ప్రకటించింది ప్రియాంక. అన్ ఫినిష్డ్ పేరుతో వస్తున్న ఈ పుస్తకాన్ని ప్రస్తుతానికి ఫినిష్ చేసినట్లు తెలిపింది. మీ అందరితో […]

Update: 2020-08-11 02:13 GMT

గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. ఒక సాధారణ అమ్మాయి అయిన ప్రియాంక.. మిస్ ఇండియాగా, మిస్ వరల్డ్‌గా టైటిల్ పొందడం.. తర్వాత బాలీవుడ్ నుంచి హాలీవుడ్ హీరోయిన్‌గా, నిర్మాతగా మారి సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్లడం.. స్ఫూర్తి కలిగించే విషయాలు.

కాగా, హాలీవుడ్ సిరీస్ క్వాంటికొ చేస్తున్న సమయంలోనే తను ఓ బుక్ రాస్తున్నట్లు ప్రకటించింది ప్రియాంక. అన్ ఫినిష్డ్ పేరుతో వస్తున్న ఈ పుస్తకాన్ని ప్రస్తుతానికి ఫినిష్ చేసినట్లు తెలిపింది. మీ అందరితో ఈ బుక్ షేర్ చేసుకునేందుకు ఎగ్జయిటింగ్‌గా ఉందని చెప్పిన ప్రియాంక.. ఇందులోని ప్రతీ అక్షరం కూడా తన అనుభవాలు, జ్ఞాపకాల సమాహారంగా రూపొందించబడిందని తెలిపింది. తన జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంటుందని చెప్పింది.

తన పుస్తకం ‘అన్ ఫినిష్డ్’.. తనలాగే నిజాయితీగా, ఫన్నీగా, ఉత్సాహంగా, ధైర్యంగా, తిరుగుబాటుగా ఉంటుందని ప్రియాంక ముందుగానే తెలిపింది. ‘తానొక ప్రైవేట్ వ్యక్తిని.. ఈ ప్రయాణంలో నా భావాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అభిప్రాయాల విషయానికొస్తే నిర్భయంగా ఉండాలనే వాతావరణంలో పెరిగాను. ప్రజలను.. ముఖ్యంగా మహిళలను మార్చేందుకు తన పుస్తకం ప్రభావితం చేయాలని కోరుకుంటున్నట్లు’ చెప్పింది. మహిళలకు ఏదో ఒకటి వెలితిగానే ఉంటుంది.. కానీ వారికి ప్రతీది కావాలి.. కలిగి ఉండాలి అనేది తన ఉద్దేశమన్న ప్రియాంక.. ఇందుకు తనే ఒక ఉదాహరణ అని కూడా తెలిపింది. ఇదే విషయాన్ని తన పుస్తకంలో పొందుపరిచానని.. మహిళల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకం రచించినట్లు తెలిపింది.

ఈ ‘అన్ ఫినిష్డ్’ పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ పబ్లిష్ చేస్తుండగా.. యూఎస్‌లో బాల్లంటెన్ బుక్స్, యూకేలో మైఖెల్ జోసెఫ్ ఒకేసారి పుస్తకాన్ని పబ్లిష్ చేయనున్నాయి.

 

Tags:    

Similar News