నాకు ఆ అవకాశం లేదు : సుశాంత్ సోదరి

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. ఆత్మహత్య సంఘటన నుంచి బయటకు రాలేకపోతున్నారు ఫ్యాన్స్. అంత గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటాడన్న కోణంలో పోలీసులు ఇప్పటికే విచారణ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సుశాంత్ అంత్యక్రియలకు హాజరుకాలేక పోయిన తన సోదరి శ్వేతాసింగ్.. తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో హార్ట్ ఫెల్ట్ నోట్ జత చేసింది. ‘నా బేబీ, నా బాబు, నా కొడుకు.. భౌతికంగా మాతో లేకపోయినా తన జ్ఞాపకాలు మాత్రం మాతో ఎప్పటికీ […]

Update: 2020-06-18 02:07 GMT

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. ఆత్మహత్య సంఘటన నుంచి బయటకు రాలేకపోతున్నారు ఫ్యాన్స్. అంత గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటాడన్న కోణంలో పోలీసులు ఇప్పటికే విచారణ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సుశాంత్ అంత్యక్రియలకు హాజరుకాలేక పోయిన తన సోదరి శ్వేతాసింగ్.. తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో హార్ట్ ఫెల్ట్ నోట్ జత చేసింది.

‘నా బేబీ, నా బాబు, నా కొడుకు.. భౌతికంగా మాతో లేకపోయినా తన జ్ఞాపకాలు మాత్రం మాతో ఎప్పటికీ ఉంటాయని’ తెలిపారు. ‘నాకు తెలుసు నువు చాలా బాధలో ఉన్నావని.. నువు ఒక గొప్ప ఫైటర్ అని తెలుసు.. నువు పోరాడావని తెలుసు.. నువు అనుభవించిన బాధకు నన్ను క్షమించు బంగారం.. నాకే అవకాశం ఉంటే ఆ బాధ నేను తీసుకుని.. నా సంతోషాన్ని నీకు ఇచ్చేదాన్ని. నీ మెరుస్తున్న కళ్లు ఎలా కలలు కనాలో నేర్పించాయి. నీ అందమైన నవ్వు నీ హృదయం ఎంత పవిత్రం అయిందో చూపించింది. నువు ఎప్పటికీ ఎక్కడైనా గొప్పగా ప్రేమించబడతావు. నువు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి’ అని కోరుకుంది.

ఇలాంటి సమయాల్లో మనం ఎదుటి వారి పట్ల దయతో ఉండటం నేర్చుకుందామని పిలుపునిచ్చింది సుశాంత్ సోదరి. ఎదుటివారిని హేట్ చేయకుండా లవ్ చేయడం అలవాటు చేసుకుందాం. స్వార్థంతో ఉండకుండా సహాయం చేద్దామని సూచించింది. అమెరికాలో ఉంటున్న శ్వేత.. సుశాంత్ అంత్యక్రియలకు హాజరుకాలేక పోయింది. ఈ మధ్యే బీహార్‌లోని తన సొంత గ్రామానికి చేరుకున్న ఆమె.. ఈ మెసేజ్ ద్వారా సోదరుడికి నివాళులు అర్పించింది.

Tags:    

Similar News