నిర్మాతలకు ఛాలెంజ్ విసిరిన హీరో శర్వానంద్

దిశ, న్యూస్‌బ్యూరో: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బంజారాహిల్స్‌లోని తన ఇంటి పక్కనున్న పార్కులో సినీ హీరో శర్వానంద్ సోమవారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సంతోష్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి మొక్కలు నాటారు. హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని, దీన్ని చూసి నేను ఇన్స్పైర్ అయి మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. […]

Update: 2020-07-13 06:56 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బంజారాహిల్స్‌లోని తన ఇంటి పక్కనున్న పార్కులో సినీ హీరో శర్వానంద్ సోమవారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సంతోష్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి మొక్కలు నాటారు. హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని, దీన్ని చూసి నేను ఇన్స్పైర్ అయి మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే తన ఇంటి పక్కనున్న జీహెచ్ఎంసీ పార్కులో యాదాద్రి విధానంలో మొక్కలు పెంచే ఏర్పాటు చేయడం జరుగుతుందని, పార్కును దత్తత తీసుకొని మొక్కలను రక్షించే బాధ్యతను తీసుకుంటానని ప్రకటించారు. పార్కులో అవసరమైన వాకింగ్ ట్రాక్, అభివృద్ధి కోసం కావలసిన ఏర్పాట్లను తన సొంత డబ్బులతో ఏర్పాటు చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఏకే ఎంటర్ ప్రైజెస్ అనిల్ సుంకర, 14 రీల్స్ ప్రతినిధులు గోపి ఆచంట, రామ్ ఆచంట, యూవీ క్రియేషన్స్ ప్రతినిధులు వంశీ, విక్కీ, ప్రమోద్, ఎస్ఎల్వీ ప్రతినిధి సుధాకర్ చెరుకూరిలకు మొక్కలు నాటాలని ఛాలెంజ్ ఇచ్చారు. పార్కును దత్తత తీసుకున్న శర్వానంద్‌ను ఎంపీ సంతోష్ అభినందించారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘ, ప్రతినిధి కిషోర్ గౌడ్, బల్దియా అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News