వారి కుటుంబాలకు అండగా ఉంటా…రామ్ చరణ్
దిశ వెబ్ డెస్క్: జన సేనాని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున ఫ్లెక్సిలు కడుతూ కరెంట్ షాక్ తగలి పవన్ అభిమానులు ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే. కాగా వారి మరణంపై హీరో రాం చరణ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ముగ్గురు అభిమానుల మరణం తనను కలిచి వేసిందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. మీ ప్రాణాల కన్నా ఏదీ ముఖ్యం కాదనీ..అభిమానులు జాగ్రత్తగా ఉండాలనీ…మీ కుటుంబ సభ్యులకు తీవ్ర ఆవేదన కలిగించ వద్దని అన్నారు. ఈ […]
దిశ వెబ్ డెస్క్: జన సేనాని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున ఫ్లెక్సిలు కడుతూ కరెంట్ షాక్ తగలి పవన్ అభిమానులు ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే. కాగా వారి మరణంపై హీరో రాం చరణ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.
ముగ్గురు అభిమానుల మరణం తనను కలిచి వేసిందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. మీ ప్రాణాల కన్నా ఏదీ ముఖ్యం కాదనీ..అభిమానులు జాగ్రత్తగా ఉండాలనీ…మీ కుటుంబ సభ్యులకు తీవ్ర ఆవేదన కలిగించ వద్దని అన్నారు.
ఈ ఘటన దురదృష్టకరమని, ఈ ఘటనలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇలాంటి సమయంలో ఆ అభిమానుల కుటుంబాలకు అండగా ఉంటాననీ తెలిపారు. ఈ మేరకు ముగ్గురు అభిమానుల కుటుంబాలకు రూ.2.5 లక్షల చొప్పున సాయం అందించనున్నట్టు తెలిపారు.