హీరో మోటార్స్ పునఃప్రారంభం!
దిశ, వెబ్‌డెస్క్: అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటార్స్ తమ కంపెనీ ప్లాంట్లను సోమవారం నుంచి పునఃప్రారంభించింది. లాక్‌డౌన్ మే 17 వరకు కొనసాగనున్న నేపథ్యంలో కేంద్రం కొత్త నిబంధనలతో హరిద్వార్, గురుగ్రామ్, ధారుహెరా ప్లాంట్లను ప్రారంభించడానికి అనుమతించింది. హీరో మోటార్స్ ద్విచక్ర వాహనాల ఉత్పత్తిని బుధవారం నుంచి ప్రారంభించనున్నట్టు సంస్థ వెల్లడించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అత్యవసర సిబ్బందికి మాత్రమే సంస్థ ప్లాంట్లకు అనుమతి ఉంటుంది. అలాగే, సామాజిక దూరం, భద్రతా ప్రమాణాలను […]
దిశ, వెబ్‌డెస్క్: అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటార్స్ తమ కంపెనీ ప్లాంట్లను సోమవారం నుంచి పునఃప్రారంభించింది. లాక్‌డౌన్ మే 17 వరకు కొనసాగనున్న నేపథ్యంలో కేంద్రం కొత్త నిబంధనలతో హరిద్వార్, గురుగ్రామ్, ధారుహెరా ప్లాంట్లను ప్రారంభించడానికి అనుమతించింది. హీరో మోటార్స్ ద్విచక్ర వాహనాల ఉత్పత్తిని బుధవారం నుంచి ప్రారంభించనున్నట్టు సంస్థ వెల్లడించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అత్యవసర సిబ్బందికి మాత్రమే సంస్థ ప్లాంట్లకు అనుమతి ఉంటుంది. అలాగే, సామాజిక దూరం, భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తారని సంస్థ స్పష్టం చేసింది. మిగిలిన ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే చర్యలు తీసుకుంటున్నట్టు వివరించింది. మార్చి 22న ప్రహుత్వ లాక్‌డౌన్ ఆంక్షలను అనుసరించి హీరో మోటార్స్ తమ ప్లాంట్లను మూసేవేసిన తర్వాత సోమవారమే మళ్లీ ప్రారంభించింది.
Tags: Hero MotoCorp, manufacturing reopen, three plants,product begin