మహిళా చైతన్యానికి తెలంగాణ కేంద్ర బిందువు: వినోద్‌కుమార్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రాంతం మహిళా చైతన్యానికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ ఛైర్మన్ వినోద్‌కుమార్ వ్యాఖ్యానించారు. శనివారం ఎంసీహెచ్ఆర్డీలోని రుద్రమహాల్‌లో ‘హెరిటేజ్ తెలంగాణ, ‘జనగణమన తెలంగాణ’ పుస్కకాలను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించాకే చారిత్రక కట్టాల పరిరక్షణకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. భారతదేశ చరిత్రలోనే కాకతీయుల సామ్రాజ్యంలో మొదటి రాణీగా రుద్రమదేవి బాధ్యతలు నిర్వహించి ఖ్యాతిని గడించారని వినోద్‌కుమార్ తెలిపారు. తెలంగాణ వీరగడ్డలో పాలించిన కాకతీయ చారిత్రక […]

Update: 2020-06-20 09:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రాంతం మహిళా చైతన్యానికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ ఛైర్మన్ వినోద్‌కుమార్ వ్యాఖ్యానించారు. శనివారం ఎంసీహెచ్ఆర్డీలోని రుద్రమహాల్‌లో ‘హెరిటేజ్ తెలంగాణ, ‘జనగణమన తెలంగాణ’ పుస్కకాలను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించాకే చారిత్రక కట్టాల పరిరక్షణకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. భారతదేశ చరిత్రలోనే కాకతీయుల సామ్రాజ్యంలో మొదటి రాణీగా రుద్రమదేవి బాధ్యతలు నిర్వహించి ఖ్యాతిని గడించారని వినోద్‌కుమార్ తెలిపారు. తెలంగాణ వీరగడ్డలో పాలించిన కాకతీయ చారిత్రక కట్టడాలతో పాటు ఇతర చారిత్రక నేపథ్యం ఉన్న కట్టడాల సంరక్షణ ప్రభుత్వ బాధ్యత అన్నారు. రామప్ప కట్టడాలకు యునెస్కో గుర్తింపు కోసం సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయాన్ని వినోద్‌కుమార్ గుర్తుచేశారు. కరీంనగర్ జిల్లా నంగునూరు, కొత్తపల్లిలోని కాకతీయుల నాటి పురాతన దేవాలయాల పునరుద్దరణ కోసం కృషి జరుగుతోందన్నారు. కార్యక్రమంలో ఎంసీహెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ బీపీ ఆచార్య, కాకతీయ హెరిటేజ్ ట్రస్టీలు పాపారావు, పాండురంగారావు, గోపాలకృష్ణ, ఇంటాక్ అధ్యక్షులు అనురాధ , గౌతమ్ పింగ్లే పాల్గొన్నారు.

Tags:    

Similar News