సైబర్ క్రైమ్స్ నుంచి తప్పించుకోవడానికి గూగుల్ టిప్స్
దిశ, వెబ్ డెస్క్ : ఓ వైపు కరోనా వైరస్ వల్ల ప్రజలు భయపడుతుంటే.. మరో వైపు సైబర్ నేరగాళ్లు కరోనా టైమ్ ను తమకు అనుకూలంగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నారు. కోవిడ్ 19 బాధితుల కోసం విరాళాలు అందించండి అంటూ సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఫేక్ మెసేజ్ లు సర్య్కూలేట్ అవుతున్నాయి. ఇవే కాకుండా క్రెడిట్ కార్డు పేమెంట్స్ తర్వాత చెల్లించాలంటూ, తక్కువ ధరలో మొబైల్ ఫోన్లు అని ఇలా రకరకాల రీతుల్లో సైబర్ […]
దిశ, వెబ్ డెస్క్ :
ఓ వైపు కరోనా వైరస్ వల్ల ప్రజలు భయపడుతుంటే.. మరో వైపు సైబర్ నేరగాళ్లు కరోనా టైమ్ ను తమకు అనుకూలంగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నారు. కోవిడ్ 19 బాధితుల కోసం విరాళాలు అందించండి అంటూ సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఫేక్ మెసేజ్ లు సర్య్కూలేట్ అవుతున్నాయి. ఇవే కాకుండా క్రెడిట్ కార్డు పేమెంట్స్ తర్వాత చెల్లించాలంటూ, తక్కువ ధరలో మొబైల్ ఫోన్లు అని ఇలా రకరకాల రీతుల్లో సైబర్ నేరగాళ్లు లింకులు షేర్ చేస్తున్నారు. వీటిని క్లిక్ చేయడం వల్ల చాలా మంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి తమ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కోవిడ్ 19 టైమ్ లో సైబర్ క్రైమ్స్ చాలా పెరిగాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. దీంతో గూగుల్ దీనిపై కొన్ని సూచనలను విడుదల చేసింది. ఈ సూచనలను పాటిస్తే సైబర్ మోసాల బారిన పడకుండా ఉండవచ్చు.
చెక్ ది సోర్స్ :
సైబర్ నేరగాళ్లు మొదట.. వెల్ నోన్, ట్రస్టెడ్, ఆథరేటివ్ సోర్సెస్ నుంచి మెసేజ్ చేసినట్లే చేస్తారు. లేదా ప్రభుత్వ అధికారులలాగా ఫోన్ ద్వారా సంప్రదిస్తారు. ప్రస్తుతం కోవిడ్ 19 విషయంలోనూ సైబర్ నేరగాళ్లు ఇదే పంథాను అనుసరిస్తున్నారు. ఇలాంటి మెసేజ్ లు, ఈమెయిల్స్ ను నమ్మకుండా.. కరోనా గురించి ఏ అప్ డేట్ కావాలన్నా ‘మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ ఫేర్ ’ డైరెక్ట్ సోర్స్ నుంచి తెలుసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ల లో మాత్రమే చెక్ చేసుకోవాలి. ప్రభుత్వ అధికారుల నుంచి ఫోన్లు రావు. వచ్చిన వాటిని నమ్మకూడదు.
నేరుగా విరాళాలు ఇవ్వండి :
కరోనా వల్ల చాలా మంది తిండి లేక అల్లాడుతున్నారు. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకుని.. పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం లేదా హాస్పిటల్స్ లోని రోగుల కోసం డబ్బులు డోనేట్ చేయండి, సాయపడండి అంటూ సైబర్ నేరగాళ్లు మెసేజ్ లు చేస్తున్నారు. ఇలాంటివి అస్సలు నమ్మకూడదు. ఎవరైనా సరే మీకు తెలిసి ఆకలితో బాధపడితే.. డైరెక్ట్ గా వెళ్లి వారికి దానం చేయండి. లేదా ట్రస్టెడ్ ఎన్జీవోలకు మనీ ఇవ్వండి. చాలామంది వలాంటీర్లు కూడా పని చేస్తున్నారు. వారికి డబ్బు రూపంలో కాకుండా.. ఆహారం అందించవచ్చు.
ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి:
మెయిల్, మెసేజ్ లో వచ్చిన లింకులపై క్లిక్ చేసేముందు వాటిని ఒకసారి ధృవీకరించుకోండి. ఇలాంటి వాటిల్లో ప్రధానంగా యూ ఆర్ ఎల్ మిస్టేక్స్ ఉంటాయి . వాటిని గమనించాలి. స్పెల్లింగ్ ఎర్రర్స్ ఉంటాయి. ఉదాహరణకు గవర్నమెంట్ మెసేజ్ అయితే gov అని ఉంటుంది. అదే తప్పుడు వెబ్ సైట్ నుంచి వస్తే.. gOv అని ఉంటుంది.
వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు :
ఎవరు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా వ్యక్తి గత వివరాలు ఇవ్వొద్దు. పాన్, ఏటీఎమ్ పిన్ నెంబర్లు షేర్ చేయద్దు. యూఏఎన్ నెంబర్, సీవీవీ కోడ్ వంటి వాటిని కూడా చెప్పకూడదు. బ్యాంకు ఖాతా వివరాలు, ఇన్సూరెన్స్ పాలసీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీస్ వివరాలు చెప్పకూడదు.
వస్తువులు, సేవల పేరుతో :
మాస్కుల మీద, ఆన్ లైన్ ఎంటర్టైన్ మెంట్ అందించే సర్వీసులపై డిస్కౌంట్ అందిస్తామంటూ మోసం చేస్తూ ఉంటారు. ఉదాహరణకు జియో మూడు నెలల ఉచిత టాక్ టైమ్, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ నెల పాటు ఉచిత మెంబర్ షిప్ వంటి మెసేజ్ లు చేస్తారు. ఇటువంటి వాటిని అస్సలు నమ్మకూడదు.