హెర్డ్ ఇమ్యూనిటీకి 43 శాతం సరిపోతుంది
– తాజా పరిశోధనలో వెల్లడి దిశ, వెబ్‌డెస్క్ : ఓ వైపు కరోనా కేసులు రోజురోజుకూ తీవ్రతరమవుతున్నాయి. మరోవైపు ఈ మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇందుకోసం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తెరమీదకు వచ్చిందే ‘హెర్డ్ ఇమ్యూనిటీ (సామూహిక రోగ నిరోధక శక్తి)’. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను హెర్డ్ ఇమ్యూనిటీతో నియంత్రించడం సాధ్యమవుతుందని పలువురు సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్ యూనివర్సిటీ, స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ శాస్త్రవేత్తలు తాజా పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలను […]
– తాజా పరిశోధనలో వెల్లడి
దిశ, వెబ్‌డెస్క్ : ఓ వైపు కరోనా కేసులు రోజురోజుకూ తీవ్రతరమవుతున్నాయి. మరోవైపు ఈ మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇందుకోసం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తెరమీదకు వచ్చిందే ‘హెర్డ్ ఇమ్యూనిటీ (సామూహిక రోగ నిరోధక శక్తి)’. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను హెర్డ్ ఇమ్యూనిటీతో నియంత్రించడం సాధ్యమవుతుందని పలువురు సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్ యూనివర్సిటీ, స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ శాస్త్రవేత్తలు తాజా పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. హెర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే.. ప్రపంచ జనాభాలో 43 శాతం మందికి కరోనా సోకితే సరిపోతుందని వారు చెబుతుండటం గమనార్హం.
ప్రస్తుతం కరోనాతో మనమందరం సహజీవనం సాగిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ బాధితుల సంఖ్య కోటి దాటింది. కరోనానే కాదు ఇంతకు ముందు కూడా చాలా వైరస్‌లు, ఫ్లూలు మానవ జీవనాన్ని అతలాకుతలం చేశాయి. కానీ చాలా సందర్భాల్లో.. వ్యాక్సిన్‌లు, మందులు రాకముందే వాటిని మనిషి జయించగలిగాడు. దానికి కారణం ‘హెర్డ్ ఇమ్యూనిటీ’. ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల పరంగా చూసినా.. ఇమ్యూనిటీ పవర్ బాగున్నట్టయితే కరోనాను ఓడించి, ఆరోగ్యంగా తిరిగొస్తున్నారు. అంటే కాలక్రమంలో దీన్ని ఎదుర్కొనే శక్తి మన బాడీకి రావాలి. ఈ లోపు చాలామందికి కరోనా వైరస్ సోకి.. వాళ్లు దీన్నుంచి బయటపడే ఇమ్యూనిటీ తెచ్చుకొని ఉండాలి. అంటే శరీరంలో ప్రవేశించిన వైరస్‌ను వారిలోని రోగనిరోధక శక్తి ద్వారానే చంపేస్తే.. అక్కడితో ఆ వైరస్ వ్యాప్తి ఆగిపోతుంది. సో దీన్నే ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ అంటారు.
రెండు రకాలు
జనాభా ప్రాతిపదికన తీసుకుంటే.. 70-80 శాతం మందికి వైరస్ సోకి, సెల్ఫ్ ఇమ్యూనిటీ పవర్ పెరిగితే ఆ వైరస్‌ను ఓడించడం(ఇప్పటి వరకు ఉన్న పరిశోధనల ప్రకారం). ఇక రెండో రకం ఏంటంటే.. ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేయడం మూలాన దాన్ని ఎదుర్కోవడం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్లు ఎప్పుడొస్తాయో కచ్చితంగా తెలియదు. మరోవైపు కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ తరుణంలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధిస్తేనే.. కరోనా త్వరగానే అంతమవుతుందని నాటింగ్‌హామ్ శాస్ర్తవేత్తలు అంటున్నారు.
టుడే సిచ్యువేషన్
ఇప్పటివరకు దేశ జనాభాలో 5.4 శాతం మంది కరోనా బారినపడ్డట్లు తాజా సర్వేల్లో వెల్లడైంది. ఈ లెక్కన హెర్డ్ ఇమ్యూనిటీ దశకు చేరేందుకు ప్రపంచ జనాభాలో 43 శాతం ఇన్ఫెక్షన్ల రేటును చేరుకునేందుకు దేశంలో 2.4 కోట్ల మందికి కరోనా సోకాల్సి ఉంటుందనేది శాస్త్రవేత్తల అంచనా. అదే కరోనా వ్యాక్సిన్ మనకు అందుబాటులోకి వస్తే.. హెర్డ్ ఇమ్యూనిటీని సాధించేందుకు ప్రపంచ జనాభాలో 60 శాతం మందికి వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ప్రకారం భారత్‌లో సామాజిక వ్యాప్తి పరిస్థితి ఇంకా రాలేదు. అదే జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ వివరాల ప్రకారం ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ స్థాయికి చేరుకోవాలంటే సుమారు 80 శాతం జనాభా ఇమ్యూన్ కావాల్సిన అవసరం ఉంటుంది.