TS : సాయం కోసం.. ఈ నెంబర్లకు కాల్ చేయండి
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. ఎటు చూసిన నీటి ప్రవాహం చెరువులు, కుంటలను తలపిస్తోంది. నగరంలో చాలా చోట్ల పురాతన ఇళ్లు కూలిపోయి ప్రజలు నిరాశ్రయులయ్యారు. వాహనాలు నీటి ఉధృతికి కొట్టుకుపోతున్నాయి. ఇక రైతుల అవస్థల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో వరుణుడు తన ప్రతాపం చూపించాడు. దీంతో ఏమీ తోచని స్థితిలో రైతులు దిగాలుగా ఉన్నారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా […]
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. ఎటు చూసిన నీటి ప్రవాహం చెరువులు, కుంటలను తలపిస్తోంది. నగరంలో చాలా చోట్ల పురాతన ఇళ్లు కూలిపోయి ప్రజలు నిరాశ్రయులయ్యారు. వాహనాలు నీటి ఉధృతికి కొట్టుకుపోతున్నాయి. ఇక రైతుల అవస్థల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో వరుణుడు తన ప్రతాపం చూపించాడు. దీంతో ఏమీ తోచని స్థితిలో రైతులు దిగాలుగా ఉన్నారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఆపదలో ఉన్నవారి కోసం ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్లను తీసుకొచ్చింది. సాయం కోసం వీటికి కాల్ చేయాలని అధికారులు కోరారు.
వరద బాధితులు కోసం 040-23450624
Ghmc పరిధిలోని సేవలు:
-విపత్తు నిర్వహణ 040-21111111, 90001 13667, 040-29555500
-చెట్లను తొలగించే బృందం 63090 62583
-నీళ్లు తొలగించడానికి 90001 13667
-విద్యుత్ కంట్రోల్ రూం 94408 13750
-ఎన్డీఆర్ఎఫ్ బృందం : 83330 68536
వరంగల్ పరిధిలో సహాయక చర్యలు : 1800 425 1980, రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సేవల కోసం 100కు సమాచారం ఇవ్వగలరు.