బ్రేకింగ్.. హైదరాబాద్‌-బెంగుళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

దిశ, వెబ్‌డెస్క్ : శుక్రవారం రాత్రి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి 18 కాలనీలు నీటమునిగాయి. వర్షం కారణంగా పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌-బెంగుళూరు రహదారిపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ మార్గంలో కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జీ వద్ద వరద నీరు నిలిచిపోయింది. వరద నీటిలో చిక్కుకున్న ఓ లారీ బ్రైక్ డౌన్ కావడంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రహదారికి […]

Update: 2021-10-08 22:31 GMT

దిశ, వెబ్‌డెస్క్ : శుక్రవారం రాత్రి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి 18 కాలనీలు నీటమునిగాయి. వర్షం కారణంగా పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌-బెంగుళూరు రహదారిపై భారీగా వరద నీరు వచ్చి చేరింది.

ఈ మార్గంలో కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జీ వద్ద వరద నీరు నిలిచిపోయింది. వరద నీటిలో చిక్కుకున్న ఓ లారీ బ్రైక్ డౌన్ కావడంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రహదారికి రెండు వైపులా దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో అరాంఘర్-శంషాబాద్ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

Tags:    

Similar News