‘ముసురు’ ముసుగులో ఓరుగల్లు..

దిశ, వెబ్ డెస్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్నిచోట్ల ముసురు కమ్ముకుంది. దీంతో జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రెండ్రోజుల కిందట కామారం వాగులో కొట్టుకుపోయిన రైతు రాజేశ్వర్ రావు ఆచూకీ ఇంతవరకు లభించలేదు. సహాయక చర్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు తాడిచెర్ల ఓపెన్ కాస్ట్‌లోకి భారీగా నీరు చేరడంతో 10వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆత్మకూరు మండలంలోని కటాక్షపూర్ చెరువు భారీ వర్షాలకు అలుగుపోస్తోంది. అంతేకాకుండా […]

Update: 2020-08-12 22:36 GMT

దిశ, వెబ్ డెస్క్ :

ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్నిచోట్ల ముసురు కమ్ముకుంది. దీంతో జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రెండ్రోజుల కిందట కామారం వాగులో కొట్టుకుపోయిన రైతు రాజేశ్వర్ రావు ఆచూకీ ఇంతవరకు లభించలేదు. సహాయక చర్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు తాడిచెర్ల ఓపెన్ కాస్ట్‌లోకి భారీగా నీరు చేరడంతో 10వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

ఆత్మకూరు మండలంలోని కటాక్షపూర్ చెరువు భారీ వర్షాలకు అలుగుపోస్తోంది. అంతేకాకుండా వరంగల్-ఏటూరు నాగారం మధ్య రోడ్డుపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు అటు వైపు వెళ్లకుండా పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీచేశారు.

Tags:    

Similar News