తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఎక్కువగా ఆ జిల్లాల్లోనే

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ఆగమనానికి ముందే వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరదలు రావడంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. మహబూబాబాద్ బస్టాంట్ సమీపంలో వరద ప్రభావానికి మార్కెట్‌లోని కూరగాయాలు కొట్టుకుపోయాయి. అటు ఖమ్మంలోనూ లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో.. ప్రజలు నీటిలో చిక్కుకున్నారు. సిద్ధిపేట, సిరిసిల్ల, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చిరుజల్లులు కురిశాయి. […]

Update: 2021-06-02 23:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ఆగమనానికి ముందే వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరదలు రావడంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. మహబూబాబాద్ బస్టాంట్ సమీపంలో వరద ప్రభావానికి మార్కెట్‌లోని కూరగాయాలు కొట్టుకుపోయాయి. అటు ఖమ్మంలోనూ లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో.. ప్రజలు నీటిలో చిక్కుకున్నారు. సిద్ధిపేట, సిరిసిల్ల, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చిరుజల్లులు కురిశాయి. అక్కడక్కడ ఓ మోస్తారు వర్షం పడింది. ఇక హైదరాబాద్‌లో ఉదయం నుంచే వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఏ క్షణంలోనైనా వర్షం పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరు, కర్నూలులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

Tags:    

Similar News