ఆ నియోజకవర్గంలో ఉప్పొంగిన వాగులు.. సర్పంచ్‌లు ఏమన్నారంటే..?
దిశ, జడ్చర్ల: నియోజకవర్గంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో నది పరివాహక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ముంపు ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బాలానగర్ మండలం సూరారం గ్రామ సమీపంలో దుందుభి నది ఉగ్రరూపం దాల్చుతూ పొంగిపొర్లుతోంది. దీనికితోడు ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతి పెరిగింది. ఈ ప్రభావంతో సూరారం-ఉడిత్యాల గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నది పరివాహక ప్రాంతానికి […]
దిశ, జడ్చర్ల: నియోజకవర్గంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో నది పరివాహక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ముంపు ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బాలానగర్ మండలం సూరారం గ్రామ సమీపంలో దుందుభి నది ఉగ్రరూపం దాల్చుతూ పొంగిపొర్లుతోంది. దీనికితోడు ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతి పెరిగింది. ఈ ప్రభావంతో సూరారం-ఉడిత్యాల గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నది పరివాహక ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా స్థానికులు ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. మండలంలోని చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతున్నాయి. వర్షాలు, వరదలు ఇలాగే కొనసాగితే మరింత ఉప్పొంగే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లు విజ్ఞప్తి చేస్తున్నారు.