గ్రేటర్‌లో భారీ వర్షం
దిశ, వెబ్‌డెస్క్ :గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆదివారం కుండపోత వర్షం కురసింది. బలమైన గాలులతో కూడిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిసిముద్దయింది. ఉదయం నుంచే వాతావరణం చల్లగా ఉండటంతో కురిసిన వర్షానికి నగరంలోని రోడ్లన్నీ భారీగా జలమయమయ్యాయి. బలంగా వీచిన గాలుల వలన కొన్నిచోట్ల విద్యుత్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ముఖ్యంగా ప్రధాన ఏరియాలు అయిన అమీర్ పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, సోమాజిగూడ, అబిడ్స్, దిల్‌సుఖ్ నగర్, కోఠి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, తార్నాక, ఉప్పల్, […]
దిశ, వెబ్‌డెస్క్ :గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆదివారం కుండపోత వర్షం కురసింది. బలమైన గాలులతో కూడిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిసిముద్దయింది. ఉదయం నుంచే వాతావరణం చల్లగా ఉండటంతో కురిసిన వర్షానికి నగరంలోని రోడ్లన్నీ భారీగా జలమయమయ్యాయి.
బలంగా వీచిన గాలుల వలన కొన్నిచోట్ల విద్యుత్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ముఖ్యంగా ప్రధాన ఏరియాలు అయిన అమీర్ పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, సోమాజిగూడ, అబిడ్స్, దిల్‌సుఖ్ నగర్, కోఠి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, తార్నాక, ఉప్పల్, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, తిరుమలగిరి, మారేడ్ పల్లి, బేగంపేట, ఖైరతాబాద్, కూకట్ పల్లి, మియాపూర్‌లో కుండపోత వాన పడింది. వర్షపు నీరు రోడ్లపై నిలవడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు