తెలంగాణకు తుఫాన్ హెచ్చరిక..

దిశ, వెబ్‌డెస్క్ : వేసవిలో ఉక్కపోతతో గరమ్ అయితున్న తెలంగాణవాసులకు చల్లని కబురు. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరిత ఆవర్తనం కారణంగా అల్పపీడనం మరింత బలపడి ఈనెల 16, 17వ తేదీ నాటికి తుఫానుగా ఏర్పడే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు […]

Update: 2021-05-13 06:03 GMT

దిశ, వెబ్‌డెస్క్ : వేసవిలో ఉక్కపోతతో గరమ్ అయితున్న తెలంగాణవాసులకు చల్లని కబురు. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరిత ఆవర్తనం కారణంగా అల్పపీడనం మరింత బలపడి ఈనెల 16, 17వ తేదీ నాటికి తుఫానుగా ఏర్పడే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ వడగండ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

 

Tags:    

Similar News