అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీకి భారీ వర్ష సూచన

దిశ, వెబ్‌డెస్క్ : ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీలో మూడు రోజుల పాటు భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈ నెల 30వ తేదీ వరకు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. రేపటి నుంచి రెండు రోజులపాటు విశాఖ, తూర్పు గోదావరి, […]

Update: 2021-10-27 21:14 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీలో మూడు రోజుల పాటు భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.

కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈ నెల 30వ తేదీ వరకు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. రేపటి నుంచి రెండు రోజులపాటు విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కూడా ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది.

 

Tags:    

Similar News