మళ్ళీ జోరువాన.. నగరంలో కుండపోత

దిశ, తెలంగాణ బ్యూరో: ఒక్క రోజు వర్షంతోనే నిండా మునిగిన నగర ప్రజలకు బుధవారం రాత్రి కురిసిన కుండపోత వర్షం నరకం చూపించింది. నడుము లోతు నీళ్ళలో కరెంటు లేక బిక్కుబిక్కుమంటూ ఉన్న లోతట్టు ప్రాంతాల ఇళ్ళల్లోని ప్రజలకు తాజా వర్షం మరింత భయానికి గురి చేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వర్షం లేకుండా విరామం ఇచ్చిందనుకున్న సమయంలో రాత్రి పది గంటల తర్వాత జోరుగా వర్షం మొదలుకావడం ఒక్కసారిగా వారిని ఆందోళనలో ముంచేసింది. జీహెచ్ఎంసీ […]

Update: 2020-10-14 12:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఒక్క రోజు వర్షంతోనే నిండా మునిగిన నగర ప్రజలకు బుధవారం రాత్రి కురిసిన కుండపోత వర్షం నరకం చూపించింది. నడుము లోతు నీళ్ళలో కరెంటు లేక బిక్కుబిక్కుమంటూ ఉన్న లోతట్టు ప్రాంతాల ఇళ్ళల్లోని ప్రజలకు తాజా వర్షం మరింత భయానికి గురి చేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వర్షం లేకుండా విరామం ఇచ్చిందనుకున్న సమయంలో రాత్రి పది గంటల తర్వాత జోరుగా వర్షం మొదలుకావడం ఒక్కసారిగా వారిని ఆందోళనలో ముంచేసింది. జీహెచ్ఎంసీ మొత్తంమీద 292 ప్రాంతాల్లో ఇండ్లల్లోకి నీరు వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఇందులో ఎక్కువ కాలనీలు తూర్పు జోన్‌ పరిధిలోనే ఉన్నాయి. తాజాగా బుధవారం రాత్రి కురిసిన వర్షం ఇంకెంత బీభత్సాన్ని సృష్టిస్తుందో…!

 

Tags:    

Similar News