హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో వర్షం దంచి కొడుతోంది. పెద్ద పెద్ద చినుకులతో కుండపోత వర్షం కురుస్తోంది. గతవారం నుంచి హైదరాబాద్‌ను పగబట్టిన వరుణుడు రోజులో రెండు మూడు సార్లు ప్రతాపాన్ని చూపుతున్నాడు. కాలనీల్లోని వరదను జీహెచ్ఎంసీ సిబ్బంది క్లియర్ చేసిన కాసేపటికే మళ్లీ వర్షం కుమ్మరిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీళ్లలోనే ఉంటున్నాయి. చెరువు కట్టలు తెగిన ప్రాంతాల్లోనూ ఇప్పటికీ ప్రజలు నీళ్లలోనే ఉంటున్నారు. ప్రస్తుతం హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, కోఠి, నాంపల్లి, రాంనగర్, విద్యానగర్, […]
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో వర్షం దంచి కొడుతోంది. పెద్ద పెద్ద చినుకులతో కుండపోత వర్షం కురుస్తోంది. గతవారం నుంచి హైదరాబాద్‌ను పగబట్టిన వరుణుడు రోజులో రెండు మూడు సార్లు ప్రతాపాన్ని చూపుతున్నాడు. కాలనీల్లోని వరదను జీహెచ్ఎంసీ సిబ్బంది క్లియర్ చేసిన కాసేపటికే మళ్లీ వర్షం కుమ్మరిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీళ్లలోనే ఉంటున్నాయి. చెరువు కట్టలు తెగిన ప్రాంతాల్లోనూ ఇప్పటికీ ప్రజలు నీళ్లలోనే ఉంటున్నారు. ప్రస్తుతం హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, కోఠి, నాంపల్లి, రాంనగర్, విద్యానగర్, నల్లకుంట, ముషీరాబాద్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, నారాయణగూడ, హిమాయత్‌నగర్, వారాసిగూడ, సికింద్రాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారు తడిసి ముద్దయ్యారు. పలుప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది.