నాగరాజు బినామీ లాకర్లలో భారీగా బంగారం

దిశ, వెబ్‌డెస్క్: రూ.కోటి లంచం తీసుకొని, ఇటీవల చంచల్‌గూడ జైలులో సూసైడ్ చేసుకున్న నాగరాజు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఆయన బినామీ నందగోపాల్‌ పేరుతో ఉన్న రెండు లాకర్ల‌ను ఓపెన్ చేసి కిలోకు పైగా బంగారు ఆభరణాలను గుర్తించింది. రెండ్రెజుల క్రితం నందగోపాల్ ఇంట్లో సోదాలు నిర్వహించగా లాకర్ల వ్యవహారం వెలుగులోకి రావడంతో గురువారం ఐసీఐసీఐ బ్యాంక్‌లో లాకర్లను తెరిచారు. ఇంతకు ముందు మరో బ్యాంక్ లాకర్లలో రెండు కిలోల బంగారాన్ని సీజ్ చేసిన సంగతి […]

Update: 2020-10-22 10:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: రూ.కోటి లంచం తీసుకొని, ఇటీవల చంచల్‌గూడ జైలులో సూసైడ్ చేసుకున్న నాగరాజు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఆయన బినామీ నందగోపాల్‌ పేరుతో ఉన్న రెండు లాకర్ల‌ను ఓపెన్ చేసి కిలోకు పైగా బంగారు ఆభరణాలను గుర్తించింది. రెండ్రెజుల క్రితం నందగోపాల్ ఇంట్లో సోదాలు నిర్వహించగా లాకర్ల వ్యవహారం వెలుగులోకి రావడంతో గురువారం ఐసీఐసీఐ బ్యాంక్‌లో లాకర్లను తెరిచారు. ఇంతకు ముందు మరో బ్యాంక్ లాకర్లలో రెండు కిలోల బంగారాన్ని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 14న నాగరాజు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేయగా ఓ బ్యాంక్ లాకర్‌కు చెందిన తాళం చెవి లభించింది. అది నాగరాజు బంధువైన నరేందర్ పేరిట అల్వాల్‌లోని సౌత్ ఇండియన్ బ్యాంక్‌ లాకర్‌గా ఏసీబీ గుర్తించింది. ప్రస్తుతం ఈకేసులో పట్టుబడ్డ నిందితులంతా చంచల్‌గూడ జైల్లో ఉన్నారు.

Tags:    

Similar News