ప్రాణాలర్పించే పోలీసును పగవాడిగ చూస్తారా…? చంద్రబోస్ పాట…

విధి నిర్వహణలో పోలీసుల కర్తవ్యం… కరోనా మహమ్మారి పై పోరాడుతున్న తీరును ప్రశంసిస్తూ రచయిత చంద్రబోస్ పాట రాశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వారి త్యాగాలను గుర్తించకుండా… వారిపై ఎదురు దాడులు చేయడం ఎంత వరకు సమంజసమని పాట ద్వార ప్రశ్నించారు. కరోనా వారియర్స్ అయిన పోలీసుల విధులను అడ్డుకోకుండా సహకరించాలని కోరారు. వారిని గౌరవిస్తూ… వారు చెప్పే సూచనలు పాటించాలని కోరారు. కాగా ఈ పాటను ప్రశంసిస్తూ… మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ […]

Update: 2020-04-24 09:13 GMT

విధి నిర్వహణలో పోలీసుల కర్తవ్యం… కరోనా మహమ్మారి పై పోరాడుతున్న తీరును ప్రశంసిస్తూ రచయిత చంద్రబోస్ పాట రాశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వారి త్యాగాలను గుర్తించకుండా… వారిపై ఎదురు దాడులు చేయడం ఎంత వరకు సమంజసమని పాట ద్వార ప్రశ్నించారు. కరోనా వారియర్స్ అయిన పోలీసుల విధులను అడ్డుకోకుండా సహకరించాలని కోరారు. వారిని గౌరవిస్తూ… వారు చెప్పే సూచనలు పాటించాలని కోరారు. కాగా ఈ పాటను ప్రశంసిస్తూ… మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ లో సాంగ్ షేర్ చేశారు. మనల్ని ఆపద కాలంలో రక్షిస్తున్న పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

” ఆలోచించండి అన్నలారా… ఆవేశం మానుకోండి తమ్ముల్లారా… రక్షించే పోలీసును రాళ్లతోని కొడతారా… ప్రాణాలర్పించే పోలీసును పగవాడిగా చూస్తారా… ఆలోచించండి అన్నాలారా… ఆవేశం మానుకోండి తమ్ములారా… మంచి చేయబోతే చెయ్యిని నరికేస్తారా… అమ్మలాగా ఆదరిస్తే మొహాన ఉమ్మేస్తారా…” అంటూ సాగే పాట సగటు మనిషిని ఆలోచింపజేసేలా ఉంది. కాగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కోరిక మేరకు ఈ పాట రాసినట్లు తెలిపారు చంద్రబోస్.


Tags: Chiranjeevi, Chandra Bose, Cyberabad Police, Song, CoronaVirus, Covid 19

Tags:    

Similar News