హీలీ తుఫాన్ ఇన్నింగ్స్..

భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్‌కు దిగింది. కాగా ఆ జట్టు ఓపెనర్ అలీసా హీలీ 75 (39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. సిక్స్‌లు, ఫోర్లతో భారత బౌలర్లను బెంబేలెత్తించింది. మరో ఓపెనర్ బెత్ మూనీ నుంచి ఆమెకు మంచి సహకారం లభించింది. హీలీ బ్యాటింగ్ చూస్తే ఆ జట్టు స్కోరు సులభంగా 200 […]

Update: 2020-03-08 03:58 GMT

భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్‌కు దిగింది. కాగా ఆ జట్టు ఓపెనర్ అలీసా హీలీ 75 (39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. సిక్స్‌లు, ఫోర్లతో భారత బౌలర్లను బెంబేలెత్తించింది. మరో ఓపెనర్ బెత్ మూనీ నుంచి ఆమెకు మంచి సహకారం లభించింది. హీలీ బ్యాటింగ్ చూస్తే ఆ జట్టు స్కోరు సులభంగా 200 పరుగులు దాటేలా కనిపించింది. కానీ రాధా యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగ్ ఆన్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన లానింగ్ (16), గార్డనర్ (2) లను దీప్తి శర్మ వెంటవెంటనే పెవిలియన్ చేర్చి భారత శిబిరంలో ఆనందం నింపింది. మరో ఎండ్‌లో మూనీ అర్థ సెంచరీతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. అయినా స్కోరు 15 ఓవర్లలోనే 150 పరుగులు దాటడం విశేషం.

Tags:    

Similar News