ప్రపంచ కిడ్నీ దినోత్సవం 2022: కిడ్నీ ఆరోగ్యానికి సింపుల్ టిప్స్‌!

మార్చి 10, ప్రపంచ కిడ్నీ దినోత్సవం గుర్తుచేసుకోవ‌డం అవ‌స‌రం. World Kidney Day most be remembered every year.

Update: 2022-03-10 13:09 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః రోజురోజుకూ మ‌ద్యం అమ్మ‌కాలు రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుంటే, రోజువారీ కూలీ నుంచి కోట్లాధిప‌తులు కూడా మ‌ద్యం మ‌త్తులో ఊగి, తూగుతున్నారు. అంత‌కుమించిన కాలుష్యం, ఆహార‌ల‌వాట్లు మాన‌వుల‌ కిడ్నీల‌కు కీడు తెస్తున్నాయి. అందుకే, మార్చి 10, ప్రపంచ కిడ్నీ దినోత్సవం గుర్తుచేసుకోవ‌డం చాలా అవ‌స‌రం. ప్రతి సంవత్సరం మార్చి రెండవ గురువారం రోజును కిడ్నీల ప్రాముఖ్యత, కిడ్నీ సంబంధిత వ్యాధుల నివార‌ణ‌పై అవగాహన కల్పించే రోజుగా జరుపుకుంటారు. ఇక‌, ఈ ఏడాది ప్రపంచ కిడ్నీ దినోత్సవం-2022 థీమ్ 'బ్రిడ్జ్ ది నాలెడ్జ్ గ్యాప్ టు బెటర్ కిడ్నీ హెల్త్'. మనం ఆరోగ్యంగా ఉండడానికి ఈ అవయవం ఎంత ముఖ్యమో తెలియక‌పోవ‌డం కార‌ణంగా తరచుగా మన కిడ్నీ ఆరోగ్యాన్ని మ‌నం విస్మరిస్తుంటాము.

అయితే, కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడ‌టానికి ఇక్కడ కొన్ని లైఫ్‌-స్టైల్‌కి సంబంధించిన ట్రిక్స్‌ని మీ ముందు ఉంచుతున్నాము. అలాగే, కిడ్నీ ఆరోగ్యంగా ఉండటానికి ఏ ఆహారం తినాలి? ఏ ఆహారానికి దూరంగా ఉండాలి? అనేవి తెలుసుకుంటే స‌గం ఇబ్బంది తీరిన‌ట్టే...

రెగ్యుల‌ర్ వ్యాయామం

మూత్రపిండాలు శ‌రీరంలో వ్యర్థాలను తొలగించడానికి, రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి, శరీరంలోని ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రించడానికి ప‌నిచేసే ముఖ్యమైన అవయవాలు. క‌నుక‌, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎందుకంటే, ఆరోగ్యకరమైన గుండె, నార్మ‌ల్ బీపీ అనేవి మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా అవసరం.

తినాల్సిన ఆహారం

  • మూత్రపిండాలు సజావుగా పనిచేయడానికి సరైన, ఆరోగ్యకరమైన ఆహారం ఎంతో ముఖ్యం. దీని కోసం ముదురు ఆకుకూరలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే ఆహారాలు మూత్రపిండాలకు అవసరం.
  • ఆహారంలో యాపిల్స్ ఉండ‌టం చాలా మంచిది. వీటిలో ఉండే పెక్టిన్ కిడ్నీ దెబ్బతినకుండా చేస్తుంది. ఇక‌, బెర్రీస్ సెల్‌ను డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.
  • రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తీసుకోవడం అవ‌స‌రం. నిమ్మకాయ ర‌సం కూడా తీసుకోవచ్చు.
  • ఇక‌, లెమన్ డ్రింక్స్‌లో సిట్రేట్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీలో రాళ్లు రాకుండా చూసుకోవచ్చు.
  • యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లను నివారించడానికి క్రాన్‌బెర్రీ జ్యూస్ కూడా మంచిది.

తిన‌కూడ‌ని ఆహారం

  • కిడ్నీ సంబంధిత వ్యాధి ఉన్న‌వారు పొటాషియం పుష్కలంగా ఉన్న‌ అవకాడోలు, నారింజ, అరటి పండ్లను తీసుకోకూడ‌దు.
  • హోల్ వీట్ బ్రెడ్ తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే ఇందులో ఫాస్పరస్, పొటాషియం, సోడియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
  • ఇక‌, శరీరంలో భాస్వరం, ప్రోటీన్ వ్యర్థాలు పేరుకుపోకుండా నిరోధించడానికి పాల‌ప‌దార్థాల‌ను తీసుకోవడం త‌గ్గించాలి.
Tags:    

Similar News