రోబోతో ఆపరేషన్.. అరుదైన ఘనత సాధించిన కేర్ హాస్పిటల్

గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్ లో రోబోతో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారు.

Update: 2023-04-19 16:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్ లో మొదటిసారిగా రోబో సహాయంతో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం ప్రకటించారు. హాస్పిటల్ లో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలకు ఆధునాతన సాంకేతికతతో నిర్వహిస్తున్నామన్నారు. వెలిస్ రోబో అందుబాటులో ఉంచామన్నారు. ఈ సందర్భంగా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ రత్నాకర్ రావు మాట్లాడుతూ.. రోబో సహాయంతో చేసే మోకాలి మార్పిడితో అత్యంత ఖచ్చితత్వంతో ఇంప్లాంట్స్ ని అమర్చవచ్చన్నారు.

దీని వలన మోకాలి మార్పిడి తర్వాత నడిచేటప్పుడు తక్కువ నొప్పితో సహజమైన అనుభవం కలుగుతుందన్నారు. మారిన జీవనశైలితో ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన పెంచుకోవాలన్నారు. ఒకసారి మోకాలి మార్పిడి తర్వాత ఎలాంటి సమస్యలు లేకుండా కనీసం 20 సంవత్సరాలు పేషంట్ కి ఏ ఇబ్బంది లేకుండా సర్జరీలు చేస్తున్నామన్నారు. రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స ఎంతో ఉపయోగమన్నారు.

Tags:    

Similar News