అతిగా ఉప్పు తింటున్నారా.. ఈ సమస్యలు తప్పవు

ఉప్పు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, అధికంగా తీసుకుంటే అంతే అనారోగ్య సమస్యలను తీసుకొస్తుంది. చాలా మంది ఈ మధ్య కాలంలో ఉప్పును అధికంగా తీసుకుంటున్నారు.

Update: 2023-02-22 03:56 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఉప్పు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, అధికంగా తీసుకుంటే అంతే అనారోగ్య సమస్యలను తీసుకొస్తుంది. చాలా మంది ఈ మధ్య కాలంలో ఉప్పును అధికంగా తీసుకుంటున్నారు. దీంతో వారు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందువలన ఉప్పును తక్కువ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

  • ఉప్పును తీసుకోవాల్సినిదాని కంటే అధిక మోతాదులో తీసుకోవడం కలిగే సమస్యలు ఏంటో తెలుసుకుందాం.

  • అధికంగా ఉప్పును తీసుకోవడం వలన రక్త ప్రసరణ దెబ్బతింటుంది. అంతే కాకుండా రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు.

  • ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలో నీరు త్వరగా అయిపోయి, ఫలితంగా డీహైడ్రేషన్ బారినపడే అవకాశం ఉందంట.

  • ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వలన మూత్రపిండాల వ్యాధిబారినపడే అవకాశం ఉంది.

  • ఉప్పు అధికంగా తింటే నాలుకపై ఉండే రుచి కళికలు ఇతర రుచులను గుర్తించలేవు. దాని ఫలితంగా ఏది తిన్నా సహించదు. అంతేకాదు, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినాలనిపిస్తుంది.

Tags:    

Similar News