సమ్మర్‌లో కల్లు ఎక్కువ దొరుకుతుందని ఫుల్‌గా తాగేస్తున్నారా..ఈ విషయాల్లో జాగ్రత్త

కల్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది కల్లును తాగుతుంటారు. ముఖ్యంగా తెలంగాణలో కల్లు తాగేవారు ఎక్కువగా ఉంటారు. అయితే ప్రతీ రోజు కల్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.

Update: 2023-04-19 08:00 GMT

దిశ, వెబ్‌డెస్క్ :  కల్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది కల్లును తాగుతుంటారు. ముఖ్యంగా తెలంగాణలో కల్లు తాగేవారు ఎక్కువగా ఉంటారు. అయితే ప్రతీ రోజు కల్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈస్ట్, జింక్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, చక్కెర, ప్రోటీన్, అమైనో ఆమ్లాలు, విటమిన్ సి, బి విటమిన్లు అన్ని ఉంటాయి. క్యాన్సర్‌కు చెక్ పెట్టడంలో కూడా కల్లు ముఖ్యపాత్ర పోషిస్తుంది అంటారు. ఇక సమ్మర్ సీజన్ ప్రారంభం అవ్వడంతో ఈ కాలంలో ఎక్కువగా కల్లు పారుతుంటుంది. దీంతో చాలా మంది కల్లు తాగడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఈ సీజన్‌లో కల్లు అధికంగా తాగడం వలన అది శరీరంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందంట. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు చుట్టు ముట్టే అవకాశం ఉంది.

సమ్మర్‌లో అధికంగా కల్లు తాగడం వలన అది కాలేయాన్ని దెబ్బతీస్తుందంట, అలాగే అధిక రక్తపోటుకు దారితీస్తుంది అంటున్నారు నిపుణులు. అంతే కాకుండా నరాలను ప్రభావితం చేయడం, రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని తగ్గిస్తుందంట. గుండె కండరాలను బలహీనపరుస్తుంది. ఇక గర్భవతులకు కూడా ఈ డ్రింక్ చెడు చేస్తుంది. ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నావారు ఈ డ్రింక్ తాగకపోవడమే మంచిదంట.

Tags:    

Similar News