దిశ, వెబ్ డెస్క్ : ఉసిరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు ఓ పరిశోధనలో వెల్లడించారు.ఉసిరిని మన రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వలన మనం అనారోగ్య సమస్యల నుంచి తొందరగా భయటపడవచ్చు.ఉసిరితో రక రకాల వంటలు కూడా చేసుకోవచ్చు.
ఆయుర్వేదంలో ఉసిరిని చాలా ఎక్కువుగా ఉపయోగిస్తారు. దీనిలో విటమిన్ సి, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి. దీనిలో ఔషధానికి సంభందించిన గుణాలూ ఎక్కువుగా ఉంటాయని నిపుణుల ఓ పరిశోధనలో వెల్లడించారు. ఉసిరి రోజు తినడం వలన మనకి కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
1. డయాబెటిస్ ఉన్న వారు రోజుకొక ఉసిరిని తీసుకుంటే చాలు కంట్రోల్ అవుతుంది.
2. బరువు తగ్గాలనుకులనే వారు ఎక్కువుగా ఉసిరిని తీసుకోవాలి.
3. దీనిలో ఉండే విటిమిన్ సి ఇమ్యూనిటీని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
4.ఇది జీర్ణ క్రియను కూడా మెరుగుపరుస్తుంది.
ఇవి కూడా చదవండి: కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ చిట్కాలను పాటించండి !