ప్రెగ్నెంట్ సమయంలో కుంకుమ పువ్వు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా?

ప్రతి మహిళ జీవితంలో అమ్మ అవ్వడం గొప్ప వరం అంటారు.ఇక మహిళ గర్భం దాల్చిందంటే చాలు, అటు, అత్తింటి వారు, ఇటు పుట్టింటి వారు ఎన్నో జాగ్రత్తలు చెబుతుంటారు.

Update: 2023-03-02 04:41 GMT

 దిశ, వెబ్‌‌డెస్క్ :  ప్రతి మహిళ జీవితంలో అమ్మ అవ్వడం గొప్ప వరం అంటారు.ఇక మహిళ గర్భం దాల్చిందంటే చాలు, అటు, అత్తింటి వారు, ఇటు పుట్టింటి వారు ఎన్నో జాగ్రత్తలు చెబుతుంటారు. ఇలాంటి ఫుడ్, తీసుకోవాలి, ఈ సమయంలో ఆ ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలంటారు.

అయితే స్త్రీలు ప్రెగ్నెంట్ సమయంలో కుంకుమ పువ్వును తీసుకుంటే పుట్టబోయే పిల్లలు తెల్లగా, అందంగా పుడుతారని చాలా మంది అంటుంటారు.కానీ నిజానికి కుకుమ పువ్వు వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అందువల్లనే ప్రెగ్నెన్సీ సమయంలో కుంకుమ పువ్వు తీసుకోవాలి అంటారు పెద్దలు, వైద్యులు.

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల మూడ్ స్వింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి. అధికంగా కోపం రావడం, చిన్న విషయాలకే టెన్షన్ పడటం లాంటివి చేస్తుంటారు. అందువలన అలాంటి సమయంలో కుంకుమ పువ్వు తీసుకోవడం వలన ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కుంకుమ పువ్వు మనలో సెరోటోనిన్ ఉత్పత్తి చేసి రక్తప్రసరణను వస్తరిస్తుంది, మనసను ప్రశాంతంగా ఉంచడమే కాకుండా, భావోద్వేగాలను అదుపు చేస్తుంది. అందువలన ప్రెగ్నెన్సీ సమయంలో కుంకుమ పువ్వు తీసుకోవాలంటారు వైద్యులు.

Tags:    

Similar News