వేసవిలో ప్లాస్టిక్ బాటిల్‌లో వాటర్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?
వేసవి కాలం మొదలైంది. మే రాకముందే ఎండలు దంచి కొడుతున్నాయి. ఇక ఈ సమయంలో ఏదైనా పనిమీద బయటకు వెళ్లాలంటే, భానుడి భగ భగలకు ప్రజలు భయపడి పోతున్నారు. *
దిశ, వెబ్‌డెస్క్ : వేసవి కాలం మొదలైంది. మే రాకముందే ఎండలు దంచి కొడుతున్నాయి. ఇక ఈ సమయంలో ఏదైనా పనిమీద బయటకు వెళ్లాలంటే, భానుడి భగ భగలకు ప్రజలు భయపడి పోతున్నారు. ఇంటి నుంచి అడుగు బయటపెడితే చాలు మాడు పగిలిపోయేంత ఎండ కొడుతుంది. దీంతో ఈ సమయంలో కొద్ది దూరం నడిస్తే చాలు విపరీతంగా దాహం వేస్తుంటది. అందుకే వేసవి కాలంలో వెంట తప్పనిసరిగా చిన్న బాటిల్ అయినా ఉండాలి అంటారు. అయితే చాలా బంది వేసవిలో ప్లాస్టిక్ బాటిల్‌లో వాటర్ తాగుతూ ఉంటారు. అయితే ప్లాస్టిక్ బాటిల్‌లో వాటర్ తాగడం వలన అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. అవి ఏంటో చూద్దాం.
- ప్లాస్టిక్ బాటిల్స్ పై ఎండ పడితే అవి మైక్రోప్లాస్టిక్ ను విడుదల చేస్తాయి. ఆ నీరు తాగితే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. అంతేకాదు కాలేయం కూడా దెబ్బతింటుంది.
- అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ ఎండలో ఉంచి అందులో ఉండే నీరు తాగడం వలన బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నదంట.
- అంతే కాకుండా ప్లాస్టిక్ బాటిల్‌లో వాటర్ తాగడవ వలన రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుందంట. అందువలన వేసవిలో వీలైనంత వరకు ప్లాస్టిక్ బాటిల్స్‌కు దూరంగా ఉండాలంటున్నారు వైద్యులు.
Also Read..
ఎక్కిళ్లు అతిగా వస్తున్నాయా? అది ప్రమాదకర వ్యాధికి సంకేతం!
‘డీప్ లెర్నింగ్ మోడల్’.. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్‌ను అంచనా వేసే కొత్త పద్ధతని కనుగొన్న పరిశోధకులు