ఆ.. టీ తాగితే థైరాయిడ్ సమస్యకు చెక్..

ఆరోగ్యం బాగుండాలంటే శరీరంలోని ప్రతి అవయవం సక్రమంగా పని చేయాలి. ఏ అవయవం తమ పని తాను చేయలేకపోయినా.. శరీరానికి ఏదో ఒక సమస్య తప్పదు. థైరాయిడ్ గ్రంధి అధికంగా మహిళల్లో సమస్యలకు కారణం అవుతోంది.

Update: 2023-02-15 09:13 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆరోగ్యం బాగుండాలంటే శరీరంలోని ప్రతి అవయవం సక్రమంగా పని చేయాలి. ఏ అవయవం తమ పని తాను చేయలేకపోయినా.. శరీరానికి ఏదో ఒక సమస్య తప్పదు. థైరాయిడ్ గ్రంధి అధికంగా మహిళల్లో సమస్యలకు కారణం అవుతోంది. గొంతు దగ్గర చిన్న సీతాకోకచిలుక ఆకారంలో ఉండే గ్రంధి థైరాయిడ్. ఇది థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయినా సమస్యే, తక్కువగా ఉత్పత్తి అయిన సమస్యే. అలా కాకుండా మన శరీరానికి తగినంత హార్మోన్లే విడుదల అయ్యేలా ఉండాలి. ఇందుకు థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు రోజు కింద వివరించిన టీని చేసుకుని తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

థైరాయిడ్ గ్రంథి శరీరంలో రెండు ప్రధాన హార్మోన్లను విడుదల చేస్తుంది. అవి ట్రయోడోథైరోనిన్, థైరాక్సిన్. వీటినే సింపుల్‌గా T3, T4 అని పిలుచుకుంటారు. ఈ హార్మోన్లు శరీరంలోని దాదాపు ప్రతి కణంపై ప్రభావం చూపిస్తాయి. శరీరంలోని కొవ్వులు, కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని ఇవి నియంత్రిస్తాయి. శరీర ఉష్ణోగ్రత, హృదయస్పందన రేటు, పునరుత్పత్తి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. ఈ హార్మోన్లు తగినంత ఉత్పత్తి కాకపోయినా, అవసరానికి మించి ఉత్పత్తి అయినా సమస్యలు వస్తాయి. ఈ హార్మోన్లు తగినంత ఉత్పత్తి కాకపోతే హైపోథైరాయిడిజం సమస్య వచ్చినట్టు, అతిగా ఉత్పత్తి అయితే హైపర్ థైరాయిడిజం సమస్య ఉన్నట్టు. ఈ సమస్యలు తరచుగా అయోడిన్ లోపం, ఆటో ఇమ్యూన్ సమస్యలు, అలాగే చెడు జీవనశైలి, కుటుంబ వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది.

ధనియాల టీ..

ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం థైరాయిడ్ సమస్య అలసట, బలహీనత,జీవక్రియ సరిగా జరగకపోవడం, రోగనిరోధక శక్తి లేకపోవడం వంటి వాటికి కారణం అవుతుంది. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు రోజూ ధనియాలతో చేసిన టీ ని తాగడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ టీ ని చేయడం చాలా సులువు. రోజూ రెండుసార్లు తాగితే ఉత్తమ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా పరగడుపున ఉదయాన్నే ఈ టీ తాగాలి.

ఇలా చేయండి..

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకొని ఒక స్పూను ధనియాలను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం లేచాక ఆ మిశ్రమాన్ని స్టవ్ పై పెట్టి మరగబెట్టాలి. తరువాత వడకట్టి గ్లాస్ లో వేయాలి. గోరువెచ్చగా మారాక తాగే ముందు కాస్త తేనె కలుపుకొని తాగాలి. ధనియాల వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

Tags:    

Similar News