ఈ ఆరు లక్షణాలు కనిపిస్తే మీ లివర్ చెడిపోయినట్లే!

ప్రస్తుతం చాలా మంది లివర్ సమస్యలతో బాధపడుతున్నారు. మన శరీరంలో ఎక్కువ పనులు చేసేది లివర్. ఇది మానవ శరీరానికి చాలా అవసరం.ఒక వేళ లివర్ సమస్యలు వస్తే మన ప్రాణం ప్రమాదంలో పడినట్లే.

Update: 2024-04-02 15:07 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మంది లివర్ సమస్యలతో బాధపడుతున్నారు. మన శరీరంలో ఎక్కువ పనులు చేసేది లివర్. ఇది మానవ శరీరానికి చాలా అవసరం.ఒక వేళ లివర్ సమస్యలు వస్తే మన ప్రాణం ప్రమాదంలో పడినట్లే. అయితే కొంత మంది తాము తీసుకుంటున్న ఆహారం, మద్యం సేవించడం వలన లివర్ సంబంధిత వ్యాధులతో సతమతం అవుతున్నారు. కాగా లివర్ చెడిపోతే మన శరీరంలో ఆరు ప్రధాన లక్షణాలు కనిపిస్తాయంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. లివర్ చెడిపోతే తీవ్రమైన అలసట ఉంటుంది, నీరసంగా అనిపిస్తుంది. చిన్న పని కూడా చేయలేకపోతారంట.

2. లివర్ సమస్యలు ఉంటే పొట్ట మీద అంతా నొప్పిగా ఉంటుంది అంటున్నారు వైద్యులు. అలాగే లివర్ ఉన్న చోట వాపు కనిపిస్తుంది.

3. లివర్ చెడిపోవడం వల్ల మూత్రం రంగు మారిపోయి, గోధుమ రంగులో వస్తుంది.

4. మలం పసుపు రంగులో కాకుండా మట్టిరంగులో వస్తుదంటే, మీ లివర్ చెడిపోయిందని గమనించాలంట.

5. పొట్ట దగ్గర, కాళ్లలో వాపులు కనిపిస్తున్నా కూడా మీ లివర్ చెడిపోయిందని అర్థం చేసుకోవాలి.

6. అరిచేతులు లేదా అరి కాళ్లలో బాగా దురదలు వస్తున్నాయంటే అందుకు లివర్ చెడిపోవడమే కారణం అంట.


Similar News