ఫీడింగ్ చేసేటప్పుడు తల్లులు స్మార్ట్ ఫోన్ వాడితే పిల్లలకు ప్రమాదమా?

ప్రస్తుతం ఉన్న కాలంలో ఫోన్ లేకపోతే ఏ పని చేయడం లేదు. పొద్దున నిద్ర లేచిన కానుండి మొదలుకుని రాత్రి పడుకునే వరకు ఫోన్‌కు బానిసలవుతున్నారు..

Update: 2023-03-16 09:46 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఉన్న కాలంలో ఫోన్ లేకపోతే ఏ పని చేయడం లేదు. పొద్దున నిద్ర లేచిన కానుండి మొదలుకుని రాత్రి పడుకునే వరకు ఫోన్‌కు బానిసలవుతున్నారు. చాలా మంది ఫోన్ లేకుండా క్షణం కూడా బ్రతకలేకపోతున్నారు. అయితే ఓ బిడ్డకు జన్మనిచ్చిన తల్లులు పిల్లలకు పాలిచ్చేటప్పుడు స్మార్ట్ ఫోన్ వాడితే ప్రమాదంలో పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తల్లి పాలు బిడ్డకు ఆరోగ్యంతోపాటు తల్లీ బిడ్డల బంధాన్ని బలోపేతం చేస్తాయి. అలాగే తల్లులు బిడ్డకు పాలిచ్చేటప్పుడు స్మార్ట్ ఫోన్ చూస్తే ఆ ప్రభావం బిడ్డ ఎదుగుదలపై పడుతుందని డాక్టర్ సునీతా చెబుతున్నారు. బిడ్డకు పాలిచ్చేటప్పుడు తల్లులు ఫోన్ చూస్తూ సరిగ్గా కూర్చోకపోవడం వల్ల బిడ్డకు నిద్ర లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా తల్లికి నడుము నొప్పితో పాటు రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల పాలిచ్చే తల్లులు స్మార్ట్ ఫోన్ వాడకుండా పిల్లలతో సంభాషిస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆ కన్ను అదిరితే శుభమా.. అశుభమా?

Tags:    

Similar News