సమ్మర్‌లో ఈతపండ్లు తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో?

మన పెద్దవారు చెబుతుంటారు. ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో నే తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని, అలాగా ప్రకృతిలో లభించే ఏ పండైనా సరే చాలా ప్రత్యేకం. అలాంటి పండ్లలో ఈతపండ్లు ఒకటి.

Update: 2023-05-16 02:16 GMT

దిశ వెబ్‌డెస్క్ : మన పెద్దవారు చెబుతుంటారు. ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో నే తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని, అలాగా ప్రకృతిలో లభించే ఏ పండైనా సరే చాలా ప్రత్యేకం. అలాంటి పండ్లలో ఈతపండ్లు ఒకటి.

సమ్మర్ వచ్చిందంటే చాలు ఈత పండ్లు పల్లెటూర్లలో ఎక్కువగా దొరుకుతాయి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు.అయితే ఈతపండ్లు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఈత పండ్లలో ఉండే గ్లూకోజ్, సుక్రోజ్, ప్రక్టోజ్ లు తక్షణ శక్తినిస్తాయి. వేసవిలో వచ్చే అలసటను శక్తినిస్తాయి. వేసవిలో వచ్చే అలసటను దూరం చేస్తుంది. ఈత పండ్లు రెగ్యులర్ గా ఉదయం వేళలో తింటే జీర్ణశక్తి చాలా బాగుంటుంది. మలబద్ధకం వంటి సమస్యలు పోతాయి. ఈత పండ్లలో ఐరన్ సంవృద్ధిగా ఉంటుంది. దీంతో రక్త వృద్ధి జరుగుతుంది. ఎనిమియా సమస్యతో బాధపడేవారు ఈత పండ్లను తింటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. వేసవిలో దొరికే ఈ పండ్లను తింటే వేడి తగ్గుతుంది. మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేందుకు ఈత పండ్లు ఎంతగానో సహాయపడుతాయి.

Tags:    

Similar News