ఖాళీ కడుపుతో ఖర్జూర తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో?
శరీరానికి ఖర్జూర చాలా మంచిది. అందుకే వైద్యులు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒకటి లేదా రెండు ఖర్జూరాలను తినాలని చెబుతుంటారు. ఖర్జూరాలో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం,
దిశ, వెబ్‌డెస్క్ : శరీరానికి ఖర్జూర చాలా మంచిది. అందుకే వైద్యులు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒకటి లేదా రెండు ఖర్జూరాలను తినాలని చెబుతుంటారు. ఖర్జూరాలో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అందువలన బరువు తగ్గాలి అనుకునే వారు దీన్ని ఖాళీ కడుపుతో తింటే చాలా మంచిదంట. అలాగే దీన్ని రోజూ ఉదయం తినడం వలన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడమే కాకుండా, ఎనర్జీని కూడా పెంచుతుందంట.
అదేవిధంగా కడుపు రుగ్మతలతో బాధపడేవారు తప్పనిసరిగా ఉదయాన్నే ఖర్జూరం తినాలి అంటున్నారు వైద్యులు. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియ, పేగు కదలిక ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఇది మలబద్ధకం, గ్యాస్ సమస్యలను తొలగిస్తుంది.
Read More: ఆదివాసీలు వాడే ఆకట్టుకునే వస్తువులను ఎప్పుడైనా చూశారా? (వీడియో)