అధిక ఉప్పుతో ఆ ముప్పు తప్పదా?
ఏ కూరలోనైనా సరే ఉప్పులేకపోతే ఆ కర్రీ టేస్టే ఉండదు. అయితే ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉన్నదంట.
దిశ, వెబ్‌డెస్క్ : ఏ కూరలోనైనా సరే ఉప్పులేకపోతే ఆ కర్రీ టేస్టే ఉండదు. అయితే ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉన్నదంట. ఉప్పును సరైన మోతాదులో తీసుకోకపోతే అనేక సమస్యలు ఎదుర్కోక తప్పదు అంటున్నారు వైద్యులు. అలాగే ప్రస్తుతం చాలా మంది గుండె పోటుతో మరణిస్తున్నారు. ఈ అకాల మరణాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. ఈక్రమంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిఫుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పును చాలా వరకు తగ్గించాలని చెబుతున్నారు.
హైబీపీ ఉన్నవారు ఉప్పును తగ్గించాలంట, ఉప్పులో ఉండే సోడియం అనారోగ్యకరమైనది, ఇది రక్తపోటు స్థాయిలను పెంచుతుంది. అధిక హైబీపీ గుండె జబ్బులు, స్ట్రోక్‌లకు కారణం అవుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దేశంలో 33 శాతం పట్టణ,25 శాతం గ్రామీణ జనాభా అధిక రక్త పోటుతో బాధ పడుతున్నారని తెలిపారు. ప్రతి వ్యక్తి 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తుంది. ఇది గుండె జబ్బులతో ఉన్నవారిలో అకాల మరణాలను తగ్గిస్తుందని తెలిపారు. దీర్ఘ కాలిక కాలేయ వ్యాధిగ్రస్తులు ఉప్పులేకుండా ఆహారాన్ని తీసుకోవాలి. శరీరంలో సోడియం, పోటిషియం ద్రవం పేరిపోకుడా ఉండటానికి ఉప్పును రోజుకు రెండు గ్రాముల చొప్పున తీసుకోవాలని, అలాగే అవయవాలలో విపరీతమైన అసిటిస్, ఎడెమో ఉన్న రోగులు ఉప్పును కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం మంచిది సూచిస్తున్నారు.
Also Read..
Fitness: మీరు బాడీ ఫిట్‌నెస్ కోరుకుంటున్నారా?.. అయితే డైలీ 2 మినిట్స్ వెనుకకు నడవండి!