Weight Loss Tips: వెరీ సింపుల్ టిప్... ఈజీగా బరువు తగ్గొచ్చు
దిశ, వెబ్ డెస్క్: చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. దీంతో వారు ఏ పని చేయాలన్నా చేయలేకపోతుంటారు....Weight Loss Tips - health tips
Weight Loss Tips
దిశ, వెబ్ డెస్క్: చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. దీంతో వారు ఏ పని చేయాలన్నా చేయలేకపోతుంటారు. ఈ కారణంగా వాళ్లు మనోవేదనకు గరువుతుంటారు. ఈ అధిక బరువు కారణంగా చాలా సమస్యలు ఎదుర్కొంటుంటారు. వేసవి(Summer)లో అయితే వీరి బాధలు చెప్పలేనివి. దీంతో ఈ సమస్యను అధిగమించడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే, వైద్య, ఆరోగ్య నిపుణులు ఓ సింపుల్ టిప్ చెబుతున్నారు. దీనిని ప్రతిరోజూ ఫాలో అయితే చాలా ఈజీగా బరువు తగ్గించుకోవొచ్చంట. అదేమిటంటే.. మనం తినే ఆహారంలో దాల్చిన చెక్క(cinnamon)ను చేర్చుకుంటే సరిపోతుందంట. దీంతో మన శరీరంలో కొవ్వు(Fat) త్వరగా కరిగిపోయే అవకాశముందంటున్నారు. వంట గదిలో సులభంగా దొరికే దాల్చిన చెక్కతో ఇలా చేసి చాలా ఈజీగా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు.