థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
ప్రస్తుతం చాలా మంది మహిళలు థైరాయిడ్ బారినపడుతున్నారు. మెడ ముందు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉండే గ్రంథి పెరుగుదల , అభివృద్ధికి దోహదపడే హార్మన్లను విడుదల చేస్తుంది
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం చాలా మంది మహిళలు థైరాయిడ్ బారినపడుతున్నారు. మెడ ముందు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉండే గ్రంథి పెరుగుదల , అభివృద్ధికి దోహదపడే హార్మన్లను విడుదల చేస్తుంది. అయితే హార్మోన్లలో అసమతుల్యత ఉన్నప్పు ఈ థైరాయిడ్ వస్తుంది.
దీంతో వ్యక్తి బరువు పెరగడం, జుట్టు రాలడం,అలసట, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.ఈ థైరాయిడ్‌ను హైపోథైరాయిడిజం అంటారు. దీని వలన చాలా సమస్యలు ఎదుర్కొంటారు. చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరికీ ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే థైరాయిడ్ కంట్రోల్‌కు రావాలంటే కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు అవి ఏమిటంటే.
- హైపోథైరాయిడిజంతో ఇబ్బంది పడుతున్నవారు కోడి గుడ్డు సొనలు తినవచ్చునంట. ఎందుకంటే దీనిలో జింక్, సెలీనియం, ప్రొటీనులు అధికంగా ఉంటాయి.
- థైరాయిడ్ తో బాధపడుతుండే వారు టీ, కాఫీలకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిది.
- గుమ్మడి గింజలు థైరాయిడ్ పనితీరును మెరుగు పరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందువలన గుమ్మడి గింజలు నట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది