పొద్దున ఎక్కువ సేపు నిద్ర పోతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

కంటి నిండ నిద్రపోవడం చాలా అదృష్టం అంటారు పెద్దవాళ్లు. ఎందుకంటే కొందరికి త్వరగా నిద్ర వస్తే మరికొందరు రాత్రి 3 దాటినా అస్సలే నిద్రపోరు. దీంతో వాళ్లు నిద్ర పోవడానికి చాలా

Update: 2023-02-16 04:40 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కంటి నిండ నిద్రపోవడం చాలా అదృష్టం అంటారు పెద్దవాళ్లు. ఎందుకంటే కొందరికి త్వరగా నిద్ర వస్తే మరికొందరు రాత్రి 3 దాటినా అస్సలే నిద్రపోరు. దీంతో వాళ్లు నిద్ర పోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇక మరికొంత మంది రాత్రి త్వరగా పడుకొని ఉదయం 11 అయినా లేవరు. అయితే ఇలా ఎక్కువ సేపు నిద్రపోయినా లేదా తక్కువ నిద్రపోయినా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. వారాంతంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గంటలు నిద్రపోయేవారిలో గుండె పనితీరు దెబ్బతింటుందని తేలింది. అయితే ఒక వ్యక్తి సుమారు ఏడు గంటలు నిద్రపోవాలి. కానీ అలాకాకుండా కొందరు ఇప్పుడేం లేచేది లే అనుకుంటూ తెల్లవారు 11 దాక లేవరు. దీంతో ఆ టైమ్‌కి లేచాక తలనొప్పి, డల్ నెస్ అనేది అధికంగా ఉంటుందంట. అదే సరైన సమయంలో పడుకొని సరైన సమయానికి లేచేవారికి ఎలాంటి తలనొప్పి లేకుండా యాక్టివ్‌గా ఉంటారంట. అందువలన ఉదయం ఎక్కువ సేపు పడుకోకూడదంట.అతి ఎక్కువ నిద్ర పోయే వారిలో డిప్రెషన్‌కు లోనవుతారంట. అంతే కాకుండా హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉందంట. అందువలన సరైన సమయానికి పడుకోని సరైన సమయానికి నిద్ర లేవాలంటున్నారు వైద్యులు.

Tags:    

Similar News