ఉదయం టిఫిన్ మానేస్తే ఎంత ప్రమాదమో తెలుసా?
ప్రస్తుతం చాలా మంది చాలా బిజీగా గడుపుతున్నారు.ఈ ఉరుకుల పరుగుల జీవనశైలి కారణంగా పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ మిస్సవుతున్నారు. కొంత మంది బిజీ షెడ్యూల్ వలన బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే, మరికొందరు కావాలనే ఉదయం టిఫిన్ చేయరు.
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం చాలా మంది చాలా బిజీగా గడుపుతున్నారు.ఈ ఉరుకుల పరుగుల జీవనశైలి కారణంగా పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ మిస్సవుతున్నారు. కొంత మంది బిజీ షెడ్యూల్ వలన బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే, మరికొందరు కావాలనే ఉదయం టిఫిన్ చేయరు.
అయితే ఉదయాన్నే టిఫిన్ చేయకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంట.ముఖ్యంగా ఉదయం పూట అల్పాహారం తినే వారితో పోల్చితే టిఫిన్ మానేసే వారిలోనే గుండె సంబంధిత జబ్బులతో పాటుగా గుండెపోటు కూడా వచ్చే అవకాశాలు 27 శాతం ఎక్కువ అని పరిశోధనలో తెలిసింది.
అలాగే టిఫిన్ మానేయడంతో పాటుగా సరైన సమయానికి అల్పాహారం తీసుకోకపోయినా గాని ఆరోగ్య సమస్యలు వస్తాయట.ముఖ్యంగా తలనొప్పి సమస్య వచ్చే ప్రమాదముంది. అంతే కాకుండా ఉదయం టిఫిన్ మానేసేవారు కొన్నిరకాల క్యాన్సర్ల భారిన పడే అవకాశం ఉందంట. అందువలన మార్నింగ్ తప్పనిసరిగా టిఫిన్ చేయాలంట. ముఖ్యంగా టీనేజీ పిల్లలు మార్నింగ్ అల్పహారం తీసుకోవాలంట. లేకపోతే అది వారి ఏకాగ్రత, ఎదుగుదల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది అంటున్నారు వైద్యులు.
Read More: ఈ వ్యాధులు ఉన్నవారు చెరకు రసం తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?