అరటి పువ్వులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

దిశ, వెబ్‌డెస్క్ : అరటి పండు ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Update: 2022-08-15 17:11 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అరటి పండు ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పొటాషియం, పీచు, మెగ్నీషియం, విటమిన్స్, మాంగనీస్, రాగి వంటి పోషక విలువలతో కూడిన ఈ బనానా శరీరానికి సరిపడ ఆరోగ్యాన్ని అందిస్తుందని అందరికీ తెలిసిందే. మరి అరటి పువ్వు ప్రయోజనాలు గురించి మీకు తెలుసా? అవునండీ వీటి వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అధిక మినరల్స్, కేలరీస్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లను కలిగిన ఈ పువ్వును వండుకుని ఆహారంలో భాగంగా కూడా ఉపయోగిస్తారు. కాబట్టి ఈ అరటి పువ్వు ప్రయోజనాల గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ప్రయోజనాలు :

ఈ అరటి పువ్వులో మూసా సేపియంటం అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. దీంతోపాటు స్టెరాల్స్ ఉంటాయి. ఇవి కూడా శరీర ఆరోగ్యంపై బాధ్యత వహిస్తాయి. అయితే ఈ విషయాన్ని నిరూపించడానికి మానవ పరిశోధనలు అవసరమైనప్పటికీ.. జంతు అధ్యయనాలు ఈ పుష్పం కొలెస్ట్రాల్‌ను తగ్గించగలదని నిరూపిస్తున్నాయి.

* ఇందులో ఉండే క్వేర్సెటిన్, కాటెచిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంతో పాటు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి.

* పోషకాహార లోపంతో బాధపడుతున్న వారు ఈ పువ్వును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల బాడీకి కావలసిన శక్తిని సమృద్ధిగా సమకూరుస్తుంది.

* ఇందులో ఫైబర్స్ అధికంగా ఉండటం వల్ల పేగు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది.

* అరటి పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, జింక్.. ఎముకలు దెబ్బతినకుండా సురక్షితంగా ఉండేందుకు కాపాడతాయి.


Tags:    

Similar News