అసలే ఎండకాలం.. ఫ్రిడ్జ్‌లో పెట్టిన మామిడిపండ్లను తింటున్నారా?

మామిడి పండ్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇక సమ్మర్‌లోనే దొరికే ఫ్రూట్స్ కాబట్టి వీటిని ఈ సీజన్‌లో అతిగా తింటుంటారు. ఎండాకాలంలో మామిడి పండ్ల

Update: 2024-04-05 16:04 GMT

దిశ, ఫీచర్స్ : మామిడి పండ్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇక సమ్మర్‌లోనే దొరికే ఫ్రూట్స్ కాబట్టి వీటిని ఈ సీజన్‌లో అతిగా తింటుంటారు. ఎండాకాలంలో మామిడి పండ్ల ధర ఒక్కోసారి విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే కొందరు మార్కెట్‌లో మామిడి పండ్లు కొనుగోలు చేయడం ఇష్టం లేక తోటలోకి వెళ్లి ఎక్కువ డబ్బులు ఇచ్చి కిలోలు కిలోలు కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. అంతే కాకుండా వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టి తింటూ ఉంటారు.

అయితే మామిడి పండ్లను ఫ్రిడ్జ్‌లో పెట్టి అస్సలే తినకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టే అవకాశం ఎక్కువగా ఉంటుదంట. ముఖ్యంగా ఫ్రిడ్జ్ లో పెట్టిన మామిడి పండ్లు తినడం వల్ల విరోచనాలు అయ్యే ప్రమాదం ఉంటుందట. అలాగే గొంతు సమస్యలు, జలుబు, దగ్గు లాంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అందు వలన అస్సలే ఫ్రిడ్జ్‌లో పెట్టిన పండ్లు తినకూడదని చెబుతున్నారు. వీలైతే ఏవైనా బాక్స్‌లలో ఎండు గడ్డి సెట్ చేసుకొని అందులో మామిడి పండ్లను పెట్టాలని చెబుతున్నారు.


Similar News