బ్రెడ్ ప్యాకెట్లో మొదటి, చివరి బ్రెడ్ కాస్త డిఫరెంట్‌గా ఎందకు ఉంటుందో తెలుసా?

ఉదయం టీలో బ్రెడ్ లేదా, బిస్కెట్ తినడం ప్రతి ఒక్కరికీ అలవాటే ఉంటుంది. చాలా మంది ఎంతో ఇష్టంగా బ్రెడ్ తింటూ ఉంటారు. అయితే కొందరు బ్రెడ్‌ని బన్‌లా తీసుకుంటే మరికొందరు బ్రెడ్ ప్యాకెట్ కొనుగోలు చేస్తారు.

Update: 2023-04-17 07:04 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఉదయం టీలో బ్రెడ్ లేదా, బిస్కెట్ తినడం ప్రతి ఒక్కరికీ అలవాటే ఉంటుంది. చాలా మంది ఎంతో ఇష్టంగా బ్రెడ్ తింటూ ఉంటారు. అయితే కొందరు బ్రెడ్‌ని బన్‌లా తీసుకుంటే మరికొందరు బ్రెడ్ ప్యాకెట్ కొనుగోలు చేస్తారు.

అయితే బ్రెడ్ ప్యాకెట్‌లో మొదటిది, చివరిది మిగితావాటికంటే భిన్నంగా ఉంటాయి. అంతే కాదు వాటిని తినడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. కాగా, అసలు మొదటి, చివరి బ్రెడ్ అలా ఎందుకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్ లోని రొట్టెను ఎక్కువగా గోధుమపిండి లేదా మైదాపిండితో చేస్తుంటారు. దీనిలో నీరు కలిపి ముద్ద చేసి పొంగడానికి ఈస్ట్ కలుపుతారు. దీనిలో ఉండే గ్లూటెన్ వల్ల మెత్తగా సాగుతుంది. ఇక బ్రెడ్ తయారు చేయడానికి పిండినీ బట్టీలో వేసి బాగా కలుపుతారంట. ఈ క్రమంలో బ్రెడ్ రోస్ట్ బయటి భాగం కాస్త గట్టిగా ఉంటుంది. దీంతో ఈ బ్రెడ్‌ను సన్నగా కట్ చేసి బ్రెడ్ ప్యాకెట్ మొదట్లో, చివర్లో వేస్తారంట. అందువలన బ్రెడ్ ప్యాకెట్ మొదట్లో, చివర్లో బ్రెడ్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుందంట.

Also Read..

పెంపుడు జంతువులను ఏసీ గదిలో ఉంచొచ్చా? 

Tags:    

Similar News