మన శరీరంలో అస్సలే నెగ్లెట్ చేయకూడని లక్షణాలు ఏవో తెలుసా?

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఇప్పుడు చాలా మంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. లక్షణాలు తెలుసుకొని వ్యాధిని గుర్తించే‌లోపే అది ప్రాణాల మీదకు వస్తుంది.

Update: 2024-02-29 15:59 GMT

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఇప్పుడు చాలా మంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. లక్షణాలు తెలుసుకొని వ్యాధిని గుర్తించే‌లోపే అది ప్రాణాల మీదకు వస్తుంది. అందువలన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు వైద్యులు.

మరీ ముఖ్యంగా ఇప్పుడున్న యూత్ ఎక్కువగా బయట ఫుడ్‌కు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మసాలా ఫుడ్ అతిగా తింటూ గ్యాస్ట్రిక్, ఆసిడీటి, క్యాన్సర్ లాంటి అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ప్రస్తుతం క్యాన్సర్ అనేది చాపకింద నీరులా ప్రవహిస్తుంది. రోజు రోజుకు వేల సంఖ్యలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. మన చుట్టూ రోజు కలిసి మెలసి తిరిగిన వారు కూడా క్యాన్సర్ వ్యాధి బారిన పడి దాని లక్షణాలు గుర్తించి, వ్యాధి అని కన్ఫామ్ చేసుకునే‌లోపే మరణిస్తున్న సంఘటనలు అనేకం చూస్తున్నాం.

ఈ నేపథ్యంలో ఆరోగ్య నిపుణులు చాలా జాగ్రత్తలు చెబుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న లక్షణాలు కనిపించినా అస్సలే నెగ్లెట్ చేయకూడదని హెచ్చరిస్తున్నారు.అవి ఏ లక్షణాలో ఇప్పుడు చూద్దాం. విపరీతమైన కడుపునొప్పి కడుపులోని క్యాన్సర్‌కు కారణం కావచ్చు అంటున్నారు వైద్యులు. అతిసారం, మలబద్ధకం, మలం నల్లగా వెళ్లడం, తరచూ తిన్న తర్వాత వాంతి కావడం, పొత్తికడుపు నొప్పి, వాపు రావడం, ఆకలి లేకపోవడం, అతిగా బరువు తగ్గడం, అలసట, వంటివి క్యాన్సర్‌కు కారణమయ్యే ఛాన్స్ ఉన్నదంట. అందువలన ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.


Similar News