Heart attack : ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఎక్కువగా గుండెపోటు వచ్చే అవకాశం ఉందో తెలుసా?

ప్రస్తుతం చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాల మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య అధికం అవుతుంది. అయితే ఈ గుండె పోటు

Update: 2023-02-27 06:24 GMT

దిశ, వెబ్‌డెస్క్ :  ప్రస్తుతం చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాల మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య అధికం అవుతుంది. అయితే ఈ గుండె పోటు, ఆహారపు అలవాట్లు, జీవనశైలినే కాకుండా బ్లడ్ గ్రూప్ కూడా కారణం అంటున్నారు వైద్య నిపుణులు. ఏ బ్లడ్ గ్రూప్ వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం.

వివిధరకాల పరిశోధనల ప్రకారం.. ఓ బ్లడ్ గ్రూప్‌తో పోల్చితే B బ్లడ్ గ్రూప్ వారికి ఎక్కువ గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది.B బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి మయోకార్డియల్ ఇన్ఫార్జన్ (గుండెపోటు) 15 శాతం వచ్చే అవకాశం ఉంది.అలాగే A బ్లడ్ గ్రూప్ వారికి కూడా ఈ సమస్య అధికంగానే ఉంటుంది అంటున్నారు వైద్యులు. A బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి గుండె ఆగిపోయే ప్రమాదం 11 శాతం పెరిగిందని, వీరిలో క్రమంగా గుండె పోటు ఎక్కువయ్యే అవకాశాలున్నట్లు తేలింది. దీంతో ఆకస్మాత్తుగా గుండె ఆగిపోవడం జరుగుతుందన్నారు.

Tags:    

Similar News